వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న రాశిఖన్నా మళయాళంలోనూ ఎంట్రీ ఇస్తున్న భామ ఏకంగా సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో ఛాన్స్ ఈ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాశి
క్రేజీ ఆఫర్లతో దూసుకెళ్తున్న బ్యూటీ రాశిఖన్నా ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తింది. తొలిసారిగా ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ సరసన జోడి కట్టిన రాశీఖన్నా ఇప్పుడు సూపర్ స్టార్ సరసన నటించే ఆఫర్ రావటంతో మరింత ఆనందంగా ఉంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ మలయాళ ఎంట్రీకి సిద్ధమవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహల్ లాల్ సినిమాలో ఆఫర్ కావటంతో రాశీ ఆనందానికి అవధుల్లేవు.
ఇప్పటికే తెలుగులో జోరు సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన భామ రాశిఖన్నా, మోహన్ లాల్ సినిమాలోనూ అదే ఫీట్ రిపీట్ చేయబోతోంది. ఇప్పటికే పాటను రికార్డ్ చేసిన రాశీ, రికార్డ్ స్టూడియోలో దిగిన ఫోటోతో పాటు తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నా చిన్ననాటి కల నెరవేరింది అంటూ ట్వీట్ చేసింది.
విలన్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో విశాల్, హన్సిక, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
