బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తన విలక్షణ నటనతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎలాంటి పాత్ర అయినా సరే రణవీర్ ఛాలెంజ్ గా తీసుకుని నటిస్తున్నాడు. ఈ 34ఏళ్ల నటుడు 2010లో బ్యాండ్ బాజా భారత్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం రణవీర్ బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ఒకరు. 

సహజంగా హీరోలకు స్టార్ స్టేటస్ వస్తే కొన్ని రకాల పాత్రలని అంగీకరించరు. కానీ రణవీర్ మాత్రం అందుకు భిన్నం. స్టార్ హీరో కాబట్టి తాను ఇలాంటి కథలే చేయాలని రణవీర్ సింగ్ గిరిగీసుకోలేదు. అందుకే రణవీర్ నుంచి అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయి. అతడు విలక్షణ నటుడు అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. 

పద్మావత్ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించినా, గల్లీ బాయ్ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించినా అది రణవీర్ కే చెల్లింది. గల్లీబాయ్ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ చిత్ర విజయం వెనుక జపాన్ దేశ ప్రభావం ఉందని రణవీర్ అంటున్నాడు. 

ఈ చిత్రంలో నటించేందుకు తాను జాపాన్ స్టైల్ యాక్టింగ్ ని ఫాలో అయ్యానని రణవీర్ అంటున్నాడు. జపాన్ నటీనటుల మెళుకువలు కొన్ని ఈ చిత్రంలో ఉపయోగించా. అది మంచి ఫలితాన్ని ఇచ్చింది అని రణవీర్ అంటున్నాడు. 

పూరి జగన్నాధ్ స్టామినా ఇదే.. బాలయ్య కోసం ఏంచేశాడంటే!

ఇలాంటి ప్రయోగాలు నటుడిగా తనని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఉపయోగపడతాయని రణవీర్ తెలిపాడు. గల్లీ బాయ్ చిత్రం నటుడిగా తనకు ఎన్నో విషయాలని నేర్పిందని రణవీర్ అన్నాడు. 

ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే రణవీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం 83లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో రణవీర్ పూర్తిగా కపిల్ దేవ్ ని తలపిస్తున్నాడు. ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం 2020లో విడుదల కానుంది.