డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. పూరి జగన్నాధ్ గత చిత్రాల ఫలితాల దృష్ట్యా ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలయింది. కానీ పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో పక్కా మాస్ మసాలా అంశాలతో ప్రేక్షకులని మెప్పించాడు. 

ఫలితంగా ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. దీనితో ప్రస్తుతం పూరి తదుపరి మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూరి జగన్నాధ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ తర్వాత పూరి జగన్నాధ్ తెరకెక్కించే చిత్రం కూడా దాదాపుగా ఖరారైంది. 

క్రేజీ న్యూస్: బాలయ్య X రోజా.. అంచనాలు పెంచేస్తున్న బోయపాటి ప్లాన్!

నందమూరి బాలకృష్ణని పూరి రెండవసారి డైరెక్ట్ చేయబోతున్నాడు. పూరి జగన్నాధ్ చాలా వేగంగా సినిమాలని పూర్తి చేసే దర్శకుడు. అది ఆయన ప్రత్యేకత. మంచి క్వాలిటీతో వేగంగా సినిమాని తెరక్కించే డైరెక్టర్ ఎవరంటే.. అంతా పూరి పేరే చెబుతారు. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ చిత్రంతో పాటు..బాలయ్య మూవీకి కూడా స్క్రిప్ట్ రెడీ చేసేశారట. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ సారి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని పూరి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

బాలయ్య పూరి కాంబినేషన్ లో పైసా వసూల్ చిత్రం తెరకెక్కింది. కానీ ఆ మూవీ నిరాశపరిచింది. బాలయ్య మేనరిజమ్స్ మాత్రం అభిమానులని ఆకట్టుకున్నాయి. దీనితో వీరిద్దరి కాంబోలో తెరకెక్కే రెండవ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం బాలయ్య రూలర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత బోయపాటి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. బోయపాటి మూవీ పూర్తయిన తర్వాతే బాలయ్య, పూరీలా చిత్రం పట్టాలెక్కుతుంది.