Image result for ranveer and deepikia

బాలీవుడ్‌ హాట్ కపుల్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రణ్ వీర్ సింగ్-దీపిక పదుకొణెలు. ఇప్పుడు వీళ్ళు మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నారా? అంటే  అవుననే అంటున్నారు బాలీవుడ్ జనాలు. రణ్ బీర్ కపూర్ తో ప్రేమ విఫలమైన తరువాత రణ్ వీర్ తో ప్రేమలో పడింది దీపిక. అలాగే అనుష్క శర్మతో ప్రేమ విఫలమైన తరువాత దీపికతో ప్రేమలో పడ్డాడు రణ్ వీర్. వీరిద్దరూ 'గోలీయోంక రాస్ లీలా 'రామ్ లీల' సినిమాలో జంటగా నటించిన తరువాత తమ ప్రేమను వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు.

 ఈ మధ్యే వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వారిద్దరి కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారని, వారి వివాహాన్ని నిశ్చయించిన తరువాత సరదాగా అందరూ కలిసి ముంబైలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌ లో డిన్నర్‌ చేశారని బీటౌన్ సమాచారం. వీరిద్దరూ విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ లాగే విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజ్ కి మొగ్గు చూపారట.

 

అయితే రణ్‌ వీర్‌ తల్లిదండ్రులు ముంబైలోనే వివాహం జరగాలని కోరడంతో సరే అన్నారు. వివాహం దక్షిణభారత సంప్రదాయం ప్రకారం జరగనుందని సమాచారం. మరో మూడునెలల్లో వారి వివాహ తంతు ముగియనుందని తెలుస్తోంది. వివాహం ముంబైలోని తాజ్‌ ల్యాండ్స్‌ ఎండ్‌ కానీ, ఫోర్‌ సీజన్స్‌ హోటల్ లేదా సెయింట్‌ రెగిస్ లలో ఏదో ఒకదానిని ఎంచుకోనున్నారని తెలుస్తోంది. వివాహానంతరం ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులకు గ్రాండ్‌ గా విందు ఏర్పాట్లు చేయనున్నారు. పెళ్లి షాపింగ్ కు దీపిక, రణ్ వీర్ తల్లిదండ్రలతో కలిసి లండన్ వెళ్లిందని బాలీవుడ్ సమాచారం.