అజ్ఞాతవాసిని బీట్ చేసిన రంగస్థలం

Rangathalam Beats Agnyaathavaasi in Tamilnadu
Highlights

అజ్ఞాతవాసిని బీట్ చేసిన రంగస్థలం

 

టాలీవుడ్ లో తమిళ్ హీరోలకు మంచి మార్కెట్ ఉందని అందరికి తెలిసిన విషయమే. మన స్టార్ హీరోలకు పోటీగా ఇక్కడ వారి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ మన హీరోలు మాత్రం అక్కడ అనుకున్నంత రేంజ్ లో రాణించడం లేదు. కనీసం మొదటి రోజు 50 లక్షల వరకైనా కలెక్షన్స్ అందుకోవడం లేదు. కానీ మెగా హీరోలు కొంచెం కొంచెంగా ఆ సంఖ్యను పెంచే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంచెం టాలీవుడ్ టెస్ట్ ని అక్కడ తగిలించాడు. 

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అక్కడ చెన్నయ్ నగరంలో మొదటి రోజు గ్రాస్ 24 లక్షలు అందుకుంది. ఇంతవరకు డైరెక్ట్ తెలుగు సినిమాలు అక్కడ ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన మార్క్ టాలెంట్ తో అక్కడ బాబాయ్ కంటే ఒక లక్ష ఎక్కువే లాగాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా చెన్నయ్ ధియేటర్లలో ఇప్పుడు 25 లక్షల రూపాయల గ్రాస్ ను అందుకుంది. 

ఇక రంగస్థలం సినిమాలోని తారాగణం కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది. సమంత - ఆది పినిశెట్టి వంటి వారు తమిళ్ లో ఎక్కువగా తెలుసు కాబట్టి చాలా మందిని సినిమా ఆకర్షించింది. మొత్తంగా  మొదటి రోజు కోలీవుడ్ లెక్కల్లో మెగా హీరోల సినిమాలే టాప్ లో నిలవడం స్పెషల్. ఇకపోతే రంగస్థలం సినిమాకు మొదటి రోజే చాలా వరకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా అన్ని వర్గాల వారిని అక్కట్టుకునేలా ఉండడంతో కలెక్షన్స్ చాలా వరకు పెరిగేలా ఉన్నాయి.   

loader