అక్కడ బాహుబలి రికార్డును దాటేసిన రంగస్థలం

Rangasthalam crossed bahubali 1 record in rtc cross road
Highlights

అక్కడ బాహుబలి రికార్డును దాటేసిన రంగస్థలం

టాలీవుడ్ దశా దిశని మార్చిన ఘనత ముమ్మాటికి బాహుబలి కే దక్కుతుంది. అప్పటి వరకు 70 కోట్లకు మించని తెలుగు సినిమా సత్తా ని ఏకంగా డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే 194 కోట్లకు చేరువ చేసింది బాహుబలి1. ఇక బాహుబలి 2 మరిన్ని అద్బుతాలు సృష్టించగా ఆ సినిమా కలెక్షన్స్ ని కొన్ని ఏరియాలలో బీట్ చేయడమే ఇప్పుడు మిగిలిన హీరోల వంతు అయింది. ఒక్కో హీరో ఒక్కో ఏరియాలో బాహుబలి కలెక్షన్స్ ని కానీ ఓపెనింగ్స్ ని కానీ బ్రేక్ చేస్తున్నాడు.

ఇప్పుడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం ఒక ఏరియాలో బాహుబలి నెలకొల్పిన కలెక్షన్స్ సునామీ ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను దక్కించుకుంది. హైదరాబాదు లోని RTC X రోడ్స్ లో బాహుబలి 2.01 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.కాగా ఇప్పుడు రంగస్థలం సినిమా ఆ మార్క్ ని బీట్ చేసి 2.04 కోట్ల గ్రాస్ తో బాహుబలి రికార్డ్ ను క్రాస్ చేసి ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న రంగస్థలం అక్కడ మరెంత దూరం వెళుతుందో చూడాలి.

loader