టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'రంగస్థలం'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రెండో రోజు నుండి నాన్ స్టాప్ గా రికార్డుల వర్షం కురిపిస్తోంది. సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసి టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 50 రోజుల వేడుకని ఘనంగా జరుపుకోబోతుంది. సినిమా 2018 ఇయర్ లో తెలుగు సినిమాల పరంగా హైయెస్ట్ సెంటర్స్ లో50 రోజుల వేడుకని జరుపుకున్న సినిమాగా నిలవబోతుంది అని చెప్పొచ్చు.

నైజాం         13 

సీడెడ్         23 

నెల్లూరు       4 

గుంటూరు    7 

కృష్ణా          3 

వెస్ట్            4 

ఈస్ట్           6 

ఉత్తరాంధ్ర    21 

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 50 రోజుల వేడుకని సుమారు 81 డైరెక్ట్ సెంటర్స్లో జరుపుకుంది. రెండో వారం నుండి వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర రంగస్థలం హిస్టారికల్ రన్ ఏమాత్రం ఆగలేదు. సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ఈ సినిమా 50 రోజులు అయినా కానీ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తుండటం విశేషం అనే చెప్పాలి.