రామలక్ష్మీ ప్రేమకి.. చిట్టిబాబు పగకి వందరోజులు

First Published 7, Jul 2018, 11:42 AM IST
rangasthalam completed 100 days
Highlights

క్రియేటివ్ జీనియస్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలయికలో వచ్చిన రంగస్థలం నిన్నటితో వందరోజులు పూర్తి చేసుకుంది. రోమాలు నిక్కపోడుచుకునే స్క్రీన్ ప్లేకి.. నటీనటుల అత్యద్భుత నటన... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తోడవ్వడంతో రంగస్థలం ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు మరపురాని విజయాన్ని అందించింది.

క్రియేటివ్ జీనియస్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలయికలో వచ్చిన రంగస్థలం నిన్నటితో వందరోజులు పూర్తి చేసుకుంది. రోమాలు నిక్కపోడుచుకునే స్క్రీన్ ప్లేకి.. నటీనటుల అత్యద్భుత నటన... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తోడవ్వడంతో రంగస్థలం ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు మరపురాని విజయాన్ని అందించింది. ఇన్నాళ్లు మాస్ కథలకే తప్పించి.. పర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు చేయలేడంటూ చెర్రీపై ఉన్న ముద్ర ఈ సినిమాతో పోయింది..

చిట్టిబాబుగా రామ్ చరణ్ ను తప్పించి మరోకరిని ఊహించుకోలేనంతగా మెగాపవర్ స్టార్ జీవించాడు. రెండు గంటలు కుర్చీలో కూర్చోవడమే గగనం అయిపోతున్న ఈరోజుల్లో 1980ల నాటి కథతో ప్రేక్షకుడిని 3 గంటల పాటు కూర్చోబెట్టాడు సుకుమార్. ఈ సినిమా సక్సెస్ వెనుక డైరెక్టర్ సుకుమార్ కష్టం ఎంతో ఉంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించి నాన్ బాహుబలి రికార్డుల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.. 

loader