బుల్లితెర‌పై వ్యాఖ్యాత‌గా అల‌రిస్తున్న‌ అన‌సూయ క్ష‌ణం చిత్రంతో వెండితెర‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో అన‌సూయ కామియో రోల్ పోషించ‌గా, ఆమె న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక ఆ త‌ర్వాత సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రంలోను మెరిసింది ఈ అమ్మ‌డు. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన విన్న‌ర్ మూవీలోను స్పెష‌ల్ సాంగ్ చేసి యూత్‌కి కిక్కిచ్చింది హాట్ బ్యూటీ అను. ఇక రీసెంట్‌గా రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర పోషించింది . చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లైన రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌ల‌తో స‌మానంగా పేరు సంపాదించుకుంది అన‌సూయ‌. ఎప్పుడు గ్లామ‌ర్‌తో యూత్‌ని ఎంట‌ర్‌టైన్ చేసే అన‌సూయ తొలిసారి ప‌ల్లెటూరి మ‌హిళ‌గా క‌నిపించి అల‌రించింది. రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో స‌హ‌జ‌త్వ న‌ట‌న‌తో మెప్పించిన అన‌సూయ‌ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే రంగ‌స్థ‌లం చిత్రం కోసం అన‌సూయ‌ని ఆడిష‌న్ చేనే టైంలో తీసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ వీడియోలో పసుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ లో కనిపిస్తుంది. చిట్టిబాబు, రంగమ్మత్త మధ్య జరిగిన సీన్‌ని ఆడిష‌న్‌లో చెప్పి మెప్పించింది అన‌సూయ‌. చిట్టిబాబు కొత్త సిల్క్ బట్టలు ధరించి వస్తే, కొంపదీసి పెళ్లి కుదిరిందా? అని అడగటం, ఆపై ఇంతకీ పిల్లెలా ఉంది? ఈ పాటికి మీ మామయ్య ఉంటేనా తెగ సంతోషపడి పోయుండేవాడు... అయినా నేను లేనా ఏంటి? అన్న డైలాగులు ఉన్నాయి. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.