చరణ్ ను డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోన్న చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'రంగ రంగ రంగస్థలాన' అంటూ సాగే టైటిల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబసభ్యుల వంటి గ్రామస్థులతో కలిసి డాన్స్ చేస్తూ చరణ్ ఈ పాటలో దుమ్ము రేపేశాడు.

పల్లెలోని సఖ్యతకీ .. సంతోషానికి .. సంబరానికి ఈ పాట అద్దం పడుతోంది. సంగీతం .. సాహిత్యం .. నృత్యం సమపాళ్లలో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. దేవిశ్రీ స్వరపరిచిన ఈ బాణీ .. ఆయనకి మరిన్ని మార్కులు తెచ్చిపెట్టడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సాంగ్ ప్రోమో చూసిన తరువాత, ఈ సినిమా హిట్ పై అభిమానుల నమ్మకం మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.