Asianet News TeluguAsianet News Telugu

#Thandel: తండేల్ గా వస్తున్న నాగచైతన్య, NC23 టైటిల్ పోస్టర్ రిలీజ్

అక్కినేని ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదరు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. యువసామ్రాట్ నాగచైతన్య తో చందూమొండేటి రూపొందిస్తున్న మూవీ టైటిల్ రిలీజ్ అయ్యింది. టైటిల్ త పాటు అదిరపోయే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. 

Naga chaitanya NC23 Thandel Movie Title poster Release JMS
Author
First Published Nov 22, 2023, 3:59 PM IST

వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్నాడు అక్కినేని హీరో నాగచైతన్య. ఈఏడాది చేసిన కష్టడీ సినిమా కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు చైతూ. బాగా కష్ట పడుతున్నాడు కూడా.ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో NC23 సినిమాతో బిజీగా ఉన్నాడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. 

బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా NC23 సినిమా రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్‌డేట్ తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్.  రేపు(నవంబర్ 23)  నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి  ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుదల చేశారు. 

ఇక ఈ సినిమాకు తండేల్(Thandel) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఈ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో ప‌డ‌వ‌లో ఉండి శత్రువులతో పోరు చేస్తూన్న‌ట్లు యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు నాగ చైతన్య. నాగచైతన్య లుక్ షాకింగ్ గా ఉంది. కండలు తిరిగిన బాడీతో.. చైతూ.. రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించాడు. అచ్చమైన మత్స్యకారుల కుర్రాడిలా కనిపించాడు చైతూ.. ఈ లుక్ కోసం.. ఈ క్యారెక్టర్ కోసం బాగా కష్టపడ్డాడు చైతూ.

బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే నాగచైతన్య.. బాగా ప్రాక్టీస్ చేసిన పాత్ర ఇదే.. మత్స్యకారుల పాత్ర. ఇక ఈసినిమాలో మొదట హీరో ఎలా ఉన్నా.. పాకిస్థానీలకు చిక్కిన తరువాత చిక్కి శల్యమైపోవాలసిందే. అదే పాత్రకోసం..రియాల్టీకి దగ్గరగా ఉంటుందని బరువు తగ్గబోతున్నారట చైతూ. 

ఈ సినమాలో  పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు నాగచైతన్య. ఆక్యారెక్టర్  కోసం బరువు కూడా తగ్గారు. జిమ్ లో చైతూ కష్టపడుతున్న వీడియోలు కూడా గతంలో రిలీజ్ అయ్యాయి.  ఇందులో చైతు మేకోవర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే సర్ ప్రైజ్ ఇచ్చాడు చైతూ. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నాగ చైతన్య కూడా యాక్టివ్ గా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీమత్స్యలేశం పంచాయతీ కొత్త మత్స్యలేశం గ్రామాన్ని ఆయన గతంలో సందర్శించిన సంగతి తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios