ఈమధ్య స్టార్ సెలబ్రిటీలు కొంత మంది ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి భూమీ ఫడ్నేకర్ అనారోగ్యబారిన పడింది. అంతే కాదు హస్పిటలైజ్ అయిన ఈ నటి తన అభిమానులకు వార్నింగ్ ఇస్తోంది. 

బాలీవుడ్‌ ప్రముఖ నటి భూమి పడ్నేకర్‌ అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెను చాలా ప్రమాదకర డెంగీ ఫీవర్ బారిన పడ్డారు. ప్రస్తుతం భూమి ముంబయ్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని భూమీ స్వయంగా తన సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అంతే కాదు.. హాస్పిటల్‌ బెడ్‌పై భూమి ఉన్న రెండు ఫొటోలను షేర్‌ చేశారు. గత కొన్ని రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పారు. 

తాను డెంగీ ఫీవర్ బారిన పడినట్టు వెల్లడించిన భూమి ఫడ్నేకర్... తను పడుతున్న బాధ ఇతరులు పడకూడదని జాగ్గరత్తగా ఉండాలంటూ సందేశం పాస్ చేసతుంది. ఈ మేరకు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు.గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పారు. దాని కారణంగా డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

View post on Instagram

ప్రతీ ఇంట్లో తప్పకుండా మస్కిటో కిల్లర్స్, మస్కిటో బ్యాడ్స్, మస్కిటో నెట్స్ లాంటివి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని భూమి సలహా ఇచ్చారు. తప్పనిసరిగా వాటిని ఉపయోగించాలని సూచించారు. అదే సమయంలో ఇమ్యూనిటీని కూడా పెంచుకోవాలని చెప్పారు. ప్రస్తుతం నటి పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్ లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.