ఎన్టీఆర్ బయోపిక్ లో రానా.. ఏ పాత్రంటే..?

Rana Daggubati roped in for Balakrishna's NTR biopic
Highlights

ఇప్పుడు ఈప్రాజెక్ట్ లోకి దగ్గుబాటి రానా కూడా జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే రానా ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచినా.. ఆయన మాత్రం నారా చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించబోతున్నారని టాక్

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మొదట తేజ దర్శకుడిగా అనుకుంటే ఆయన స్థానంలో క్రిష్ వచ్చి చేరాడు. క్రిష్ రావడంతో ఈ ప్రాజెక్ట్ స్కేల్ కాస్త పెరిగిపోయింది. బయోపిక్ లో పాత్రల కోసం స్టార్ నటీనటులను రంగంలోకి దింపుతున్నారు. తద్వారా సినిమాపై హైప్ మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.

బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నుండి విద్యాబాలన్ ను రప్పించారు. ఇక మరికొన్ని ముఖ్య పాత్రల కోసం ఫేమస్ సీనియర్ ఆర్టిస్టులను తీసుకున్నారు. ఇప్పుడు ఈప్రాజెక్ట్ లోకి దగ్గుబాటి రానా కూడా జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే రానా ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచినా.. ఆయన మాత్రం నారా చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించబోతున్నారని టాక్. దీనికోసం ఇప్పటికే రానాపై టెస్ట్ కట్ కూడా చేశారని వినికిడి.

అంతేకాదు.. చంద్రబాబు మేనరిజమ్స్ తో రానా కొన్ని డైలాగ్స్ చెప్పి రిహార్సల్స్ కూడా చేశారట. ఇప్పుడు రానా ప్రాజెక్ట్ లోకి రావడంతో మరో స్టార్ హీరో మహేష్ బాబుని కూడా ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఒప్పించాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో కృష్ణకి సంబంధించి ఓ సీన్ లో మహేష్ బాబు కనిపించాలని ఆయనని కోరితే నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఏఎన్నార్ పాత్రలో సుమంత్ కనిపించబోతున్నాడని టాక్. ఇటీవలే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది!

 

loader