రానా కొత్త సినిమా టైటిల్ ఇదే!

rana daggubati new movie titled as aranya
Highlights

దగ్గుబాటి రానా మొదటి నుండి కూడా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ 

దగ్గుబాటి రానా మొదటి నుండి కూడా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తున్నాడు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రభు సోలోమన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో వచ్చిన 'హతి మేరే సాథీ' కథ స్పూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసినట్లు రానా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తమిళంలో 'కాదన్' అనే టైటిల్ ఫిక్స్ చేయగా, తెలుగులో 'అరణ్య' పేరుని ఖాయం చేసినట్లు తెలుస్తోంది. హిందీలో ఈ చిత్రాన్ని 'హతి మేరే సాథీ' అనే పేరుతోనే విడుదల చేయనున్నారు. అడవిలో అంతరించిపోతున్న ఏనుగులు, వాటి సంరక్షణ నేపధ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో రానా ఏనుగులపై స్వారీ చేసేవాడిగా కనిపించబోతున్నారు.

రీసెంట్ గా ఈ సినిమా మున్నార్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది దీపావళి కానుకుగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

 

loader