పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వర్మ రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ పై పవన్ అభిమానుల ఆగ్రహం పవన్ ఫ్యాన్స్ ను గొర్రెలనీ, కాటమరాయుడుకన్నా పోర్న్ మూవీ బెటరని వర్మ ట్వీట్స్
శివ టు వంగవీటి ఈవెంట్ తర్వాత అస్సలు ఎవరి గురించి అనవసరంగా స్పందించనని ప్రామిస్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఒట్టు పెట్టి మరీ చెప్పినా తన రూటు మార్చలేదు. మెగా హీరోలపై తనకు వీలైనప్పుడల్లా స్పందించే వర్మ మెగా ఫ్యామిలీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా రిలీజ్ తో మళ్లీ స్పందించాడు.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ను టార్గెట్ చేస్తూ వర్మ రెచ్చిపోయాడు. గతంతో పోలిస్తే ఈసారి విమర్శల స్థాయి బాగానే పెంచాడు వర్మ. సూటిగా ‘కాటమరాయుడు’ పేరెత్తకుండా మారుపేర్లతో ఈ సినిమా గురించి నానా మాటలూ అనేశాడు వర్మ. వర్మ కమెంట్స్ లో చూస్తే... ఎవరో 70 ఏళ్ల పెద్ద మనిషి వచ్చి ‘కాటమరాయుడు’ చూడటం కంటే పోర్న్ సినిమా చూడటం మేలని చెప్పాడట. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కంటే ‘కాటమరాయుడు’ బెటర్ సినిమానో కాదో తనకు తెలియదని.. ఐతే ‘బాహుబలి-2’ ట్రైలర్ చూసి పవన్ కొంచెం అయినా నేర్చుకోవాలని.. ఇలాంటి పవర్ లెస్ సినిమాలు తీయడం మానుకోవాలని.. ఇది తన సిన్సియర్ అడ్వైజ్ అని తనదైన శైలిలో వర్మ 'ట్వీట్ చేశాడు.
వర్మ ఇలా ‘కాటమరాయుడు’ మీద ట్వీట్ల దాడి మొదలుపెట్టగానే పవన్ అభిమానులు అతడి మీదికి దండెత్తారు. దీంతో వర్మ కూడా వాళ్లను టార్గెట్ చేశాడు. ఎవరో సుబ్బారావు చెప్పాడట.. అతడి అభిమానులు ఎద్దులు కూడా కాదు, గొర్రెలు అని. ఎద్దులకు కనీసం తోలు మందంగా అయినా ఉంటుందని.. కానీ అతడి అభిమానులకు అలా కూడా ఉండదని. ఇక ఎవరో రాకేశ్వర్ అనే ఒక క్యారెక్టర్ పేరు పెట్టి.. ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నందుకు గర్వించడం మాని.. ఒక్క మంచి సినిమా అయినా ప్రొడ్యూస్ చేయాల్సిందని. వర్మ ట్వీట్ చేశాడు.
ఇక చివరగా ఈ ట్వీట్లకు కంక్లూజన్ ఇస్తూ.. కాటమరాయుడు.. అవతార్ కన్నా, బాహుబలి-2 ట్రైలర్ కన్నా బాగుందని తన పనిమనిషి చెప్పిందని.. దీన్ని 100 మిలియన్ సార్లు చూడాలని కూడా పేర్కొన్నట్లుగా వర్మ చెప్పాడు. అలా పవన్ అభిమానుల్ని వర్మ వ్యాఖ్యలు మరింత ఉడికించేస్తున్నాయి. మరి పవన్ అభిమానులు దీన్ని ఎలా తీసుకుంటారో చూడాలి.
