ఛార్మి, వర్మ, పూరీ మస్తీ.. వీకెండ్ పార్టీ వీడియోలు వైరల్

ramgopalvarma puri jagan charmi akash weekend party video viral
Highlights

  • ప్రస్థుతం ఆకాష్ హీరోగా మెహబూబా చిత్రం తెరకెక్కిస్తున్న పూరీ
  • రీసెంట్ గా హిమాచల్ షెడ్యూల్ పూర్తి చేసుకొచ్చిన యూనిట్
  • హైదరాబాద్ లో జరిగిన వీకెండ్ పార్టీలో వర్మ,పూరీ, చార్మి హంగామా

రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాథ్‌ బ్యాచ్ వీకెండ్ సందర్భంగా... శనివారం రాత్రి ఫుల్ పార్టీ చేసుకున్నారు. శివ సినిమా తర్వాత నాగార్జునతో మరో చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇక్కడే హైద్రాబాద్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పూరీ నిర్వహించిన పార్టీలో రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నాడు.

 

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మెహ‌బూబా షూటింగ్‌ను పూర్తి చేసుకొని పూరీ హైద‌రాబాద్ వ‌చ్చారు. వీకెండ్‌ని ఇటు పూరీ అటు వ‌ర్మ స‌ర‌దాగా గ‌డిపారు. ఈ పార్టీలో ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించిన వీడియోలని ఛార్మి త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో పూరీ తనయుడు ఆకాశ్‌తో పాటు ప‌లువురు టెక్నీషియ‌న్స్ కూడా క‌నిపించారు. వర్మ, పూరి, ఆకాష్, మరికొందరు ఓ వ్యక్తి వయోలిన్ ప్లే చేస్తుండగా సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

పార్టీ సందర్భంగా వీడియో చిత్రీకరించిన ఛార్మి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 

loader