Asianet News TeluguAsianet News Telugu

జల్లికట్టును సపోర్టు చేస్తున్న వారిని ఏకిపారేశాడు వ‌ర్మ‌

  • దేశవ్యాప్తంగా చ‌ర్చ‌నీయంగా మారిన జ‌ల్లిక‌ట్టు ఆట 
  • జ‌ల్లిక‌ట్టు కు స‌పొర్ట్ తెలిపిన ప‌లువురు సెలబ్రిటీలు
  • జల్లికట్టును సపోర్టు చేస్తున్న వారిని ఏకిపారేసిన వ‌ర్మ‌
ramgopalvarma oppose  jallikattu

 

 కాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం.. ఈ విషయంలో జల్లికట్టును సపోర్టు చేస్తున్న వారిని ఏకిపారేశాడు. ''తమిళ వారికి జల్లికట్టు అనేది కరక్ట్ అయితే.. ఆల్ ఖైదీ తీవ్రవాదులకు కూడా అమాయకులైన వారిని పీక కోసి చంపడం కూడా కరక్టే. సినిమావాళ్ళేమో తెర మీద కనీసం ఒక పిట్టను కూడా హింసించినట్లు చూపకూడదు కాని.. తమిళ ప్రజలు మాత్రం గోవులను దారుణంగా హింసిస్తూ జల్లికట్టు ఆడుకోవచ్చా? జల్లికట్టు అనేది అనాగరికం'' అంటూ ట్వీట్లతో విరుచుకుపడ్డాడు వర్మ. 

''జనాల ఆనందం కోసం మూగ జీవాలను హింసించడమే జల్లికట్టు. జయలలిత శశికళ వంటి లీడర్లను తెగల జాతుల్లా పూజించే జనాలకు ఇది కూడా నప్పిందిలే. జల్లికట్టును సపోర్టును చేస్తున్న సెలబ్రిటీలను.. 100 ఎద్దులతో తరుముతూ పరిగెత్తించాలి. అప్పుడు తెలుస్తుంది వారికి జనాలు ఎద్దులను తరిమితే వాటి ఫీలింగ్ ఎలా ఉంటుందో'' అంటూ రామూ గాట్టిగానే ఎద్దేవా చేశాడు.

 అసలు ఒక అనాగరిక హక్కు కోసం పోరాడుతున్న ఆ జనాలను ఏమనాలి? జంతువులను టార్చర్ చేయడానికి అధికారం అడుగుతున్న వారికి ఏమని చెప్పాలి? అంటూ ఆలోచింపజేసే ప్రశ్నలనే వేశాడులే.'నోరు లేని జీవాలను జల్లికట్టు పేరుతో హింసించడం.. తీవ్రవాదం కంటే పెద్ద నేరమే'' అంటూ ముగింపు పలికాడు. వోట్ల కోసం.. పార్టీ టిక్కెట్ల కోసం.. ఈ సెలబ్రిటీలు అందరూ జల్లికట్టుకు సపోర్టునిస్తున్నారని డైరెక్టుగానే చెప్పేశాడులే.

Follow Us:
Download App:
  • android
  • ios