1995లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమా రంగీలా ఈ మూవీతో బాలీవుడ్ లో సూపర్ హిట్ డైరక్టర్ అయిపోయిన వ‌ర్మ‌ రంగీలా సినిమాకు ఎటువంటి సీక్వెల్ ను చేయట్లేదు అని చెప్పిన వ‌ర్మ‌
ఇక ఫ్లాపులతో సావాసం చేస్తున్న అమీర్ ఖాన్ కు కూడా కెరియర్ టర్న్ అయిపోయింది. అంతేకాదండోయ్.. అసలు బాలీవుడ్ లో ఏ.ఆర్.రెహ్మాన్ తన పంజాను గట్టిగా విసరడం మొదలెట్టింది ఆ సినిమా నుండే. ఇంతకీ ఈ రంగీలా పిల్లకు ఇప్పుడు సీక్వెల్ వస్తోందా రావట్లేదా?
''అసలు నాకు సీక్వెల్ తీయాలి అనే ఆలోచన కూడా తట్టలేదు.ఇప్పటికైతే నేను రంగీలా సినిమాకు ఎటువంటి సీక్వెల్ ను చేయట్లేదు'' అంటూ సెలవిచ్చాడు రామ్ గోపాల్ వర్మ. మనోడు ఇలా చెబుతాడు కాని.. చేయనన్న పనినే చేస్తుంటాడు. గతంలో తాను తీసిన శివకు శివ 2006 అంటూ ఒక సీక్వెల్ తీశాడు.
అలాగే సర్కార్ సినిమాకు సీక్వెల్స్ తీస్తూనే ఉన్నాడు. అప్పట్లో డర్నా సినిమాలకు అనే సీక్వెళ్ళను ప్రొడ్యూస్ చేశాడు కూడా. ఇప్పుడు అందుకే మనోడు రంగీళా సీక్వెల్ తీయట్లేదు అంటే అంత నమ్మశక్యంగా లేదు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం ఫీట్లు చేస్తాడో!
