గురువు రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ ఇద్ద‌రు  పోటిప‌డుతున్నారు పూరి వ‌ర్మ‌ ఇద్ద‌రు ఒకే రోజు త‌మ సినిమాల ట్రైల‌ర్ ల‌ని విడుద‌ల చేశారు

ఏమోగానీ, అటు వర్మ 'సర్కార్‌-3' పైనా, ఇటు పూరి 'రోగ్‌'పైనా భారీ అంచనాలే వున్నాయి. ఇప్పటికే 'సర్కార్‌' సిరీస్‌లో రెండు సినిమాల్ని రూపొందించిన వర్మ, 'సర్కార్‌' అనే పేరుని ఓ బ్రాండ్‌గా మార్చేసిన విషయం విదితమే. 'సర్కార్‌-3' బాలీవుడ్‌ సినిమా కాగా, 'రోగ్‌' కన్నడ సినిమా. అన్నట్టు, 'రోగ్‌' తెలుగులోనూ విడుదలవుతోందనుకోండి.. అది వేరే విషయం. కన్నడ, తెలుగుల్లో ద్విభాషా చిత్రంగా దీన్ని విడుదల చేయనున్నారు. 

ఇదిలా వుంటే, 'రోగ్‌' ట్రైలర్‌ విడుదల వేడుక పైనుంచే, హీరోగా ఇషాన్‌ని అందరికీ పరిచయం చేస్తానంటున్నాడు పూరి. ‘మరో చంటిగాడి ప్రేమ కథ‘ అంటూ,‘ఇడియట్’ సినిమాని మరోసారి గుర్తు చేసేందుకు పూరి ప్రయత్నిస్తున్నాడు. 'రోగ్‌'లో ఏంజెలా, మనారా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం విదితమే. 'రోగ్‌' సంగతిలా వుంటే, త్వరలో పూరి, బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు.