సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో  స్పందించి వివాదాలు సృష్టించే రాంగోపాల్ వర్మ మరోసారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ట్విట్ చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ వైఖరి చూస్తే... అనుమానం కలుగుతోందని... అందరినీ కలుపుకుని పోతానంటూ చిరంజీవి బాటలో పయనించేేలా కనిపిస్తుందని వర్మ ఆరోపించారు.

అంతేకాదు గతంలో కూడా పవన్ పాల్గొన్న ఆత్మగౌరవ సభ వేదికలో పవన్ పాటని టార్గెట్ చేశాడు. 'సభా వేదికగా పవన్ పాడిన పాట బాగుందా? లేక వంగవీటి సినిమాలో నేను పాడిన చంపారా... పాట బాగుందా' అంటూ ట్విట్ చేశాడు రాంగోపాల్ వర్మ. మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, ప్రభాస్, రవితేజ, చిరంజీవి మరియు పవన్ కల్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని చెప్పాలని కోరారు. ఈ విషయంపై మీడియా అంతేకాక మ్యూజిక్‌ డైరెక్టర్లు మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ థమన్‌ను ప్రశ్నించాలని ట్వీట్ చేశారు వర్మ.