సన్నీ లియోనీపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్ సన్నీ సహా మహిళలందరినీ అవమానపరిచాడని ఫిర్యాదు తనపై ఫిర్యాదు సన్నీని ఫాలో అయ్యే 18లక్షల మందకి అవమానమేనంటున్న వర్మ 

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా మరోసారి తనదైన శైలిలో ట్వీట్ చేసి వివాదంలో పడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘ట్విటర్‌’లో రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచంలోని మహిళలందరూ పురుషులకు సన్నీ లియోనీ(సినీ నటి) కలిగించేంత సంతోషం కలిగించాలని కోరుకుంటున్నానంటూ వర్మ ట్వీట్‌ చేశారు.

దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై గోవాలో విశాఖ మాంభ్రే అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో వర్మ వెనక్కి తగ్గడం లేదు. సన్నీ లియోన్‌ నిజాయతీ పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తీకరిస్తున్నాని, నిజంగా మిగతా మహిళాలకంటే సన్నీ లియోన్ ఎంతో నిజాయితీగా ఉటుందని, తన వ్యాఖ్యలు అర్ధం కాని మూర్ఖులే ఇలా విమర్శలు చేస్తారని రివర్స్ లో ఫైర్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ.

కాగా వర్మ ట్వీట్ పై మహారాష్ట్ర ఎన్సీపీ నేత, ఎమెల్సీ విద్యా చవాన్ సీరియస్ గా రియాక్ట్ అయారు. మరోవైపు గోవా సామాజిక కార్యకర్త విశాఖ మాంబ్రే కూడా తీవ్రంగా స్పందించారు. వర్మపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

అయినా తగ్గని వర్మ 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న సన్నీని అవమానిస్తున్న 212 మంది సామాజిక కార్యకర్తలపై కేసులు పెడతానని వర్మ పేర్కొన్నాడు. తాను తల్లులు, చెల్లెలు, కూతుళ్లు తప్ప మిగతా స్త్రీలందరిని గౌరవిస్తూనే ప్రేమిస్తానని వర్మ పేర్కొనడం వివాదానికి మరింత అగ్గి రాజేస్తోంది. మరోవైపు వర్మ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు,నిరసనలు వెల్లువెత్తున్నాయి.