Asianet News TeluguAsianet News Telugu

హోమోసెక్సువల్ ఆరోపణలు నిజమే...జయకుమార్, ఆరోపణలపై వర్మ క్లారిటీ

  • రాంగోపాల్ వర్మపై హోమో సెక్సువల్ అంటూ ఆరోపణలు
  • వర్మపై ఆరోపణలు చేసిన రచయిత జయకుమార్
  • తన స్క్రిప్ట్ కాపీ కొట్టి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తీశాడన్న జయకుమార్
  • హోమో సెక్సువల్ ఆరోపణలపై వర్మ స్పందన ఎలా వుందంటే..
ramgopal varma response to homosexual allegations

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మాటలతో తనకు సంబంధించిన ఎలాంటి అంశంపైన చర్చలోనైనా సరే.. ఎదుటివారిని గందరగోళంలో పెట్టి ప్రశ్నల కోసం వెతుక్కునేలా చేస్తాడు వర్మ. తాను ఏది మాట్లాడినా వందకు వందశాతం ఒప్పే అనేలా వాదనల్లో గెలుస్తాడు వర్మ. అలాంటి వర్మ.. ఓ విషయంలో మాత్రం అసలు నోరు మెదపకపోతుండటం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు.

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ కథ తనదేనని, వర్మ దాన్ని కాపీ కొట్టి తనకు క్రెడిట్స్ ఇవ్వట్లేదని రచయిత జయకుమార్ ఆరోపణలు చేయటమే కాక కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జయకుమార్ మరో అడుగు ముందుకేసి రాంగోపాల్ వర్మపై 'హోమో సెక్సువల్' ఆరోపణలు చేస్తున్నారు. వర్మ టీమ్ లో పనిచేసిన సమయంలో.. తనను లైంగికంగా వేధించాడని జయకుమార్ ఆరోపిస్తున్నారు. హోటల్ రూమ్స్ కు రావాలని తన లైంగిక కోరికలు తీర్చాలని వర్మ ఒకరకంగా తనకు నరకం చూపించాడని ఆరోపించడమే కాక.. వర్మ తనకు పంపించిన అసభ్య మెసేజ్ లను కూడా జయకుమార్ బయటపెట్టారు.

జయకుమార్ తాజాగా వాట్సాప్ స్క్రీన్ షాట్స్‌ ను ఓ మీడియా ఛానెల్‌కు అందజేయడంతో.. వర్మ ఇలాంటి కోణం కూడా ఉందా? అని చాలామంది ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అయితే టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇప్పుడు అలాంటివి ఎవరైనా క్రియేట్ చేయచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.

 

తనపై, తన సినిమాలపై ఎవరు జోక్యం చేసుకున్నా వైల్డ్ గా స్పందించే వర్మ.. హోమో సెక్సువల్ ఆరోపణల విషయంలో మాత్రం స్పందించకపోవడంతో పలు అనుమాలు తలెతత్తుతున్నాయని అంటున్నారు. జయకుమార్ చేసిన కాపీ ఆరోపణలపై వర్మ స్పందించారు తప్పితే.. హోమో సెక్సువల్ ఆరోపణలపై మాత్రం మౌనం వహిస్తున్నారు. జయకుమార్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం కాబట్టి స్పందించడం అనవసరం అని వర్మ భావిస్తున్నారా?.. లేక దీనిపై స్పందిస్తే తనలోని మరో కోణం బయటపడుతుందని భయపడుతున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. టీవి చానెల్స్ లో గంటల తరబడి డిబేట్ చేసే వర్మ.. ఈ విషయంపై ప్రశ్నలు ఎదురైతే నోరు మెదపకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది.

 

మరోవైపు వర్మ అసలు రంగు తెలియకనే.. చాలామంది ఆయన్ను అభిమానిస్తున్నారని జయకుమార్ అంటున్నారు. తాను వర్మను దగ్గరిగా చూసిన వ్యక్తిగా ఆయనలోని వికృత కోణాల్ని చూశానని చెబుతున్నారు. వర్మ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నవాళ్లు ఇప్పుడు తనను బండ బూతులు తిడుతూ మెసేజ్ లు చేస్తున్నారని, వాళ్లెవరికీ ఆయన అసలు నైజం తెలియకపోవడం వల్లే అంతలా ఆరాధిస్తున్నారని అంటున్నారు.

 

ఇక వర్మ తనకు టాలెంట్ లేదని, ఎన్నో ఛాన్స్ లు ఇచ్చినా నిరూపించలేకపోయాడని చేస్తున్న ఆరోపణలకు జయకుమార్ కౌంటర్ ఇచ్చారు. తనకు టాలెంట్ లేకపోతేనే ఇన్నాళ్లు తన టీమ్ లో కొనసాగించారా? అని ప్రశ్నించారు. సర్కార్-3 టైమ్ లో కథ రాసుకోలేక ఆర్జీవి సతమతమయ్యారని, కథ కోసం నన్ను సంప్రదిస్తే వాట్సాప్ లోనే సినాప్సిస్ రాసి పంపించానని చెప్పుకొచ్చారు. అలాంటిది.. ఇప్పుడు తనపై దొంగతనం ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు జయకుమార్. అంతేకాక వర్మ బాధితులంతా #మీటూవర్మ క్యాంపెయిన్ లో పాల్గొనాలని జయకుమార్ పిలుపునిచ్చాడు.  మరోవైపు దీనిపై వర్మ స్పందించకపోవడం జయకుమార్ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios