ట్విటర్ ఎకౌంట్ క్లోజ్ చేసి సంచలన కమెంట్స్ కు దూరంగా ఉంటున్న వర్మ సర్కార్ ఫ్లాప్ ఇచ్చిన షాక్ తో వర్మ జ్ఞానోదయం సినిమాలేవీ ఎనౌన్స్ చేయకుండా యూ ట్యూబ్ వీడియోలకే పరిమితమైన వర్మ
సర్కార్ ఇచ్చిన షాక్ తో రామ్ గోపాల్ వర్మకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది. వర్మ లేటెస్ట్ మూవీ సర్కార్ డిజాస్టర్ కావడంతో... ఏకంగా నిత్యం సంచలన కమెంట్స్ చేస్తూ.. తాను అమితంగా ఇష్టపడే సోషల్ మీడియా నుంచి వైదొలిగాడు. ట్విటర్ ఎకౌంట్ క్లోజ్ చేసిన వర్మ తాజాగా యూట్యూబ్ వీడియోలతో తన పెతాపం సూపిత్తున్నాడు.
దర్శకుడిగా ఫ్లాపులనూ, సూపర్ డూపర్ హిట్లను చూసిన వర్మ ఇప్పుడు వెండితెరని వదిలి యూట్యూబ్ వీడియోలతో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. తను తీసే సినిమాల వల్ల నిర్మాతలు నష్టపోవడం తప్ప లాభాలు రాకపోవడంతో వర్మ ఫ్రీ ట్యూబ్ వైపు వచ్చేసాడు. ఇక్కడైతే పెద్దగా ఖర్చుపెట్టకుండానే, సెన్సార్ కట్స్ లేకుండానే తనకు నచ్చిన విధంగా సినిమాలు యూట్యూబ్‌లో పెట్టి ఇష్టం వచ్చింది పెట్టొచ్చనే ఆలోచనతో నగ్నత్వాన్ని, అశ్లీల పదజాలాన్ని హైలైట్ చేస్తూ తన వెబ్ సిరీస్‌ని ఇంట్రడ్యూస్ చేసాడు. 'గన్స్ అండ్ థైస్' మొదటి ఎపిసోడ్ రాకముందే 'మై సన్నీలియోని బన్‌నా చాహ్‌తీ హూ' అంటూ పోర్న్ స్టార్ కావాలని కలలు కనే ఒక యువతి అంతరంగాన్ని షార్ట్ ఫిలింలో ఆవిష్కరించాడు. ముంబయికి మకాం మార్చి 'కంపెనీ' అనే సొంత ఆఫీస్ ఓపెన్ చేసి ఈ పనుల్లోనే మునిగాడు వర్మ.
అయితే అమితాబ్ నటించినా.. వర్మ సర్కార్ 3 డిజాస్టర్ అయింది. ఇంతకాలం ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా చలించని వర్మ ఈ షాక్ తర్వాత కొత్త సినిమాలు అనౌన్స్ చేయడం మానేసి యూట్యూబ్ వీడియోలు మొదలు పెట్టాడు. బ్యాడ్ లక్ ఏమిటంటే యూట్యూబ్‌లో మునుపటిలా రెవెన్యూ లేదు. క్వాలిటీ కంటెంట్ ఇప్పటికే చాలా లభిస్తోంది కనుక దాని మధ్య వర్మ ఎంతో అద్భుతమైన కంటెంట్ అందిస్తే తప్ప ఉపయోగం వుండదు. అశ్లీలత వల్ల కొద్ది రోజుల పాటు మేనేజ్ చేయచ్చు కానీ దాని మీదే డిపెండ్ అయి వెబ్ సిరీస్ నడిపితే కష్టం కనుక ఇదీ వర్మకి అగ్ని పరీక్షే.
