నంది అవార్డులను ఎంపిక చేసినోళ్లకు ఆస్కార్ ఇవ్వాలి-వర్మ

ramgopal varma on nandi  awards
Highlights

  • నంది అవార్డుల ఎంపికపై తనదైన శైలిలో వర్మ స్పందన
  • పక్షపాతం లేకుండా అవార్డులిచ్చిన ఫస్ట్ కమిటీ అంటూ వర్మ స్పందన
  • కేవలం మెరిట్ ప్రకారమే అవార్డులిచ్చారంటూ సెటైరిక్ కామెంట్స్

ఏపీ సర్కారు బంగారు నందులపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా స్పందించలేదు ఏంటా అనుకుంటుండగానే వర్మ సోషల్ మీడియాలో స్పందించాడు.  నంది అవార్డులపై మొహమాటం లేకుండా - డేరింగ్‌ డైరెక్టర్‌, రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో అభిప్రాయం వెల్లడించాడు. నంది అవార్డులు ప్రకటించినప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంపై పలువురు చిత్ర రంగ ప్రముఖులు విమర్శలు, వ్యాఖ్యలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించాడు.

 

మ్యాటర్ ఏదైనా తనదైన శైలిలో స్పందించే వర్మ  నంది అవార్డుల జాబితాపై కూడా తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించాడు. "అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా! వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్, నాకు తెలిసి ఇలా ఏ మాత్రం కనీసం 1% పక్షపాతం లేకుండా కేవలం ప్రతిభ (మెరిట్) మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ ఈ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు. ఇంత అద్భుతమైన నీతి నిజాయతీ గల "నంది అవార్డు కమిటీ" కి ఖచ్చితంగా  "ఆస్కార్ అవార్డు ఇవ్వాలి" - "వావ్! నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ! ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్"  అంటూ కమిటీ సభ్యులపై సటైర్లు వేశారు

loader