తెలుగులో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన అర్జున్ రెడ్డి అర్జున్ తమిళ రీమేక్ తో విక్రమ్ కుమారుడు ధ్రువ్ అరంగేట్రం ఈ మూవీకి వర్మ అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ స్కెచ్ రిలీజ్ చేసిన విక్రమ్
సూపర్ హిట్ తెలుగు మూవీ ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. భారీ మొత్తం వెచ్చించి తెలుగు సినిమా రీమేక్ రైట్స్ కొన్న విక్రమ్ అండ్ కో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ సినిమాకు వాళ్లు పెట్టుకున్న టైటిల్ ‘వర్మ’ అని.
ఈ మూవీకి సంబంధించి ధ్రువ్ గడ్డంతో ఉన్న స్కెచ్ ను ఫస్ట్ లుక్ లో భాగంగా విడుదల చేశారు కూడా. విక్రమ్ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు.
"YOU'RE GODDAMN RIGHT. అంటూ #varmathemovie #dirbala #dhruvvikram #E4entertainment @Itsjosephjaxson." హ్యాష్ ట్యాగ్ లు పెట్టి విక్రమ్ తన ఇన్ స్టా గ్రామ్ లో ‘వర్మ’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు.
ఇక ఈ పోస్టర్, టైటిల్ పై స్పందించిన వర్మ ఈ పేరు ఎక్కడో విన్నట్లు గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు వుందంటూ తన స్టైల్లో ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాడు.
