వర్మా నువ్వే గే.. రాజమౌళి కాలి గోటికి సరిపోవు-వర్మ పై నెటిజన్లు

First Published 19, Nov 2017, 10:24 PM IST
ramgopal varma comments on rajamouli ramcharan ntr pic trolled
Highlights
  • రామ్ గోపాల్ వర్మను ఫుట్ బాల్ ఆడుకుంటున్న నెటిజన్లు
  • ముఖ్యంగా ఆడుకుంటున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు
  • గే కల్చర్ అంటూ చెర్రీ, జూనియర్, జక్కన్నల పిక్ పై వర్మ కామెంట్

దర్శకుడు రాజమౌళి.. యంగ్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్‌ లతో కలిసి తీసుకున్న ఫోటో ను వల్గర్ గా కమెంట్ చేస్తూ సంచలన దర్శకుడు వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఆ పిక్ ను ట్యాగ్ చేస్తూ వర్మ వాళ్లను ముగ్గురిని ఉద్దేశించి స్వలింగ సంపర్కులు అంటూ కామెంట్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వర్మ తానేదో ఫన్నీగా కామెంట్ చేసినట్టు ఫీలైనా ఆ కామెంట్ పై తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. వర్మ తన కామెంట్ లో... నాకు మహిళలంటే అమితమైన గౌరవం ఉంది. వారిని బాగా ఆరాధిస్తాను. ఇలా స్వలింగ సంపర్కుల సంస్కృతి (గే కల్చర్)ని బాహాటంగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ జక్కన్న పిక్ ను ట్యాగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

ముగ్గురి ఫొటోను షేర్ చేస్తూ వర్మ ‘‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా. పైగా ముగ్గురూ కూడా వివాహితులే. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. తిరుపతి వెంకన్న గారు మీరైనా చెప్పండి'' అంటూ వ్యాఖ్యలు చేశాడు.

రాంగోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తోపాటు.. నెటిజన్లు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. వర్మ కామెంట్లకు వ్యతిరేకంగా దారుణమైన కామెంట్లు చేశారు.

ఓ నెటిజన్ స్పందిస్తూ... నీ కూతురును కూడా పంపించు.. అప్పుడు అది గ్యాంగ్ బ్యాంగ్ కల్చర్ అవుతుంది అని షాక్ ఇచ్చాడు. స్వలింగ సంపర్కుల సంస్కృతిని నీ కంటే ఎవరూ బాగా ప్రమోట్ చేయడం లేదు. వారితో పోల్చితే నీవే బాగా సరిపోతావు అని మరో నెటిజన్ ఓ ఫోటోతో స్పందించారు.

దర్శకుడు రాజమౌళి కాలి గోటికి కూడా పనికిరావు. నీ ఎర్రి పువ్వు సినిమాలు... ఎదో ఒక వెధవ కాంట్రవర్సీ క్రియేట్ చేసి బ్రతుకుతున్నావ్...  అందరి జీవితాలకు ఓ ముగింపు ఉంటుంది. నీకు అది చాలా దగ్గరలోనే అనిపిస్తోంది... పాపం పిచ్చి పర్వర్టెటెడ్ సైకో గాడివి అయిపోయావ్ అని మరో నెటిజన్ విరుచుకుపడ్డాడు.

నేను బాలాజీని చెబుతున్నాను.. ఈ భూమ్మీద నీకు టైమ్ దగ్గర పడింది ఆర్జీవీ. నువ్వు చనిపోబోతున్నావు' అంటూ ఓ అభిమాని తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌, రాంగోపాల్ వర్మ పరస్పరం ముద్దాడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసి ‘గే కల్చర్ అది కాదు.. ఇది. మీ హ్యాండ్ అన్నింట్లోనూ ఉంటుంది' అంటూ కామెంట్ చేశాడు. ఈ మధ్య వర్మకు అత్యధిక ట్రోలింగ్ తెచ్చిపెట్టిన పోస్ట్ ఈ పోటోపై పెట్టిన కమెంట్స్ వల్లే వచ్చింది.

loader