సన్నీ ఫిగర్ చూసి పులకించా,ఇవాంకాను చూడాలని వుంది-వర్మ

ramgopal varma comments on ivanka trump comparing sunny leone figure
Highlights

  • నవవంబర్ 28న హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ సమిట్ కు ఇవాంక ట్రంప్
  • ఇవాంక పర్యటన సందర్భంగా సంచలన కామెంట్ చేసిన రాంగోపపాల్ వర్మ
  • ఇవాంకను నేరుగా చూడాలని వుందంటూ పోర్న్ స్టార్ సన్నీ లియోనీతో పోలిక

హైదరాబాద్‌లో నవంబర్‌ 28న జరగబోయే గ్లోబల్ ఎంట్రాప్రెన్యూర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు త్వరలో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెను మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి అయిన సన్నీలియోన్‌తో పోలుస్తూ.. ఫేస్‌బుక్‌లో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు.

 

ఈనెల 28న హైదరాబాద్‌లో నిర్వ‌హించే గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు ఇవాంక హాజ‌రు కానున్న సందర్భంగా 100కోట్ల భారీ వ్యయంతో హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ ముస్తాబు చేస్తోంది. వీవీఐపీలు తిరిగే జోన్లో కొత్త‌ రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తులు, ఫుట్‌పాత్‌లు, గార్డనింగ్ పనులు ఇలా అనేక అభివృద్ధి ప‌నులు చేపట్టింది. ముఖ్యంగా సదస్సు జరిగే హైటెక్‌సిటీలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవాంకా కోసం తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు భారీ ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవాంకా వెస్టిన్‌ హోటల్‌లో బస చేస్తున్న నేపథ్యంలో మూడురోజుల ముందు నుంచి భద్రతపరమైన ఆంక్షలుంటాయని, అందరూ సహకరించాలని పోలీసులు ఆయా పరిసర ప్రాంతాల వారికి ఇప్పటికే సూచించారు.

 

ఇక వర్మ మాత్రం “నాకు రాజకీయాలపై ఎంతమాత్రం అవగాహన లేదు. అందులో నాకు జ్ఞానం కూడా లేదు. అసలు ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించడానికి గల ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను మాత్రం ఇవాంకా అందమైన ఫిగర్ ను నేరుగా చూడాలని ఎంతోగానూ ఎదురుచూస్తున్నాను. గతంలో భారత్‌కు శృంగార తార సన్నీలియోన్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చాలా పులకరించిపోయాను' అంటూ వర్మ తన ఫేస్‌బుక్‌లో కామెంట్ పోస్ట్‌ చేశాడు.

loader