వర్మ తెరకెక్కించిన జీఎస్టీ పుణ్యమా అని కొద్దిరోజుల పాటు వార్తా ఛానళ్లకు మరో హాట్ సబ్జెక్ట్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. ఆ రేంజ్ లో వర్మ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాపై జరిగిన చర్చల్లో భాగంగా ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి వర్మ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా ఇరువరి మధ్య వాదులాట చోటు చేసుకుంది. ఈ వ్యవహారం నలిగి.. నలిగి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లటమే కాదు..దేవి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వర్మను ఏ క్షణంలో అయినా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.అరెస్టు వార్తల నేపథ్యంలో వర్మ ఎలా రియాక్ట్ అవుతారా? అన్న ఉత్కంఠ వ్యక్తమైంది. అందరిలా వ్యవమరిస్తే ఆయన వర్మ ఎందుకు అవుతారన్నట్లే ఆయన రియాక్షన్ ఉంది. తాజాగా తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన ట్విట్టర్ అకౌంట్లో తన బ్రాండ్ తొలి హీరో ఫోటోను పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 16న తన మొదటి సినిమా శివ తొలిరోజు షూటింగ్ ను ఇదే రోజు స్టార్ట్ చేశామని.. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇదే రోజున తనకు ఓ కొత్త యాక్టర్ దొరికారని.. అతడెవరో కాదు నాగార్జున అంటూ ట్వీట్ చేశారు.ఇప్పటివరకూ నాగ్ ను చూడని రియలిస్టిక్ యాక్షన్ హీరో పాత్రలో నాగార్జున కనిపిస్తారంటూ కొన్ని ఫోటోలు ఫేర్ చేశారు. ప్రస్తుతం నాగ్ తో వర్మ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణస్టూడియోలో నాగ్ హీరోగా వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్టిల్స్ కొన్నింటిని ట్వీట్ ద్వారా షేర్ చేశారు. 

 

అంతే కాదు..తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.కు స్పందిస్తూ బాధ్యత గల పౌరుడిగా తాను సంబంధిత అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నానని అన్నారు.