గౌతమిపుత్ర సక్సెస్ కావాలని బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ నిర్మించిన ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి
రెండు భారీ సినిమాలు, అందులోనూ మెగాస్టార్ 150, బాలకృష్ణ 100వ చిత్రాలు రిలీజ్ కావటంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో యమా క్రేజ్ నెలకొంది. అయితే ఇండస్ట్రీకి ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడో దశాబ్దం క్రితం ఉన్నా... ఆ తర్వాత సంక్రాంతి పుంజులు పెద్దగా పందెం వేసుకోలేదు. కానీ ఈ సారి మాత్రం కోళ్ల పందేల మాట ఎటున్నా... చిరు, బాలయ్య మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు. రిలీజ్ వాయిదా వేసుకోకుండా పోటాపోటీకి దిగుతున్నారు. అయితే ఇప్పటికే చరణ్ తో ఒకేరోజు రెండు భారీ చిత్రాలు వద్దని మెగాస్టార్ తన పెద్దరికాన్ని చాటుకోగా.. చరణ్ కూడా తండ్రి బాటలోనే బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపాడు.
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం హిట్ కావాలని కోరుకుంటూ బాలయ్య కు శుభాకాంక్షలు అందజేశాడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ . చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి నిర్మాత అయిన చరణ్ బాలయ్య కు శుభాకాంక్షలు అందజేయడంతో అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు నందమూరి అభిమానులు కూడా షాక్ అయ్యారు .
పోటీ ఉన్న సమయంలో మరో హీరో సినిమా వస్తోంది అంటే ఆ సినిమా గురించి అంతగా పట్టించుకోరు లేదా ఆ సినిమాపై బురద జల్లడం చేస్తుంటారు కొంతమంది కానీ చరణ్ మాత్రం చాలా స్పోర్టివ్ గా బాలయ్య సినిమా కూడా హిట్ కావాలని కోరుకోవడం నిజంగా చరణ్ లో ఉన్న పెద్దరికం తేట తెల్లం అవుతోంది . మొత్తానికి ఈ సంక్రాంతి కి రెండు పెద్ద సినిమాలు వస్తుండటం తో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య అంతకు మించి ఉన్న గౌరవాన్ని చాటి చెప్తోంది.

