రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సమంత హిరోయిన్ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నా మరింత ఆలస్యమయ్యే అవకాశం

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఇప్పటికే రామ్ చరణ్ సరికొత్త గెటప్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మాంచి హైప్ క్రియేటైంది. సరికొత్త లుక్ లో కనిపిస్తున్న రామ్ చరణ్ లుక్ కొత్తగా అనిపిస్తోంది. తెలుగు తెరపై ఇప్పటిదాకా కనిపించని ఓ వెరైటీ కథతో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం ఆర్ఆర్ పై సుకుమార్ చాలా సంతోషంగా వున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హిరోయిన్ గా సమంత నటిస్తోంది.

    ఇప్పటికే రంగస్థలం చిత్రానికి సంబంధించిన షూటింగ్ మేజర్ పార్ట్ అంతా పూర్తి చేసుకున్నారు. మిగతా షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. మొదట ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాతలు మాత్రం సంక్రాంతికి ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్తున్నా... సంక్రాంతికి మరో రెండు భారీ ప్రాజెక్టులు రిలీజ్ అవుతున్నందున రంగస్థలం విడుదల సాధ్యమయ్యేలా కనిపించట్లేదు.

    సినిమా టీమ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయితే.. రంగస్థలం వాయిదా తప్పదని తెలుస్తోంది. అదే జరిగితే రంగస్థలం సినిమా వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.