రాంచరణ్ రికార్డుల పరంపర ఇంకా ఆగట్లేదు

Ramcharan  record breaking collections in second week too
Highlights

టాలీవుడ్ రికార్డులను దున్నేస్తున్న చరణ్

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకుని సంచలన కలెక్షన్ నమోదు చేసింది. శ్రీమంతుడు చిత్రాన్ని వెనక్కి నెట్టి తెలుగు సినిమా చరిత్రలో టాప్ 5 ఆల్ టైమ్ గ్రాసర్స్‌లో చోటు దక్కించుకుంది. 

తొలివారంలోనే ప్రపంచ వ్యాప్తంగా 128 కోట్ల గ్రాస్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లిన ఈ మూవీ రెండో వారాంతం కూడా మంచి వసూళ్లు సాధించింది. రెండో వారాంతమైన శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం దాదాపు రూ. 19.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో 10 రోజుల టోటల్ కలెక్షన్ రూ. 147.10(గ్రాస్) కోట్లకు చేరుకుంది. బాహుబలి, బాహుబలి 2 రికార్డులను పక్కన పెడితే..... రంగస్థలం కంటే ముందు మగధీర(రూ. 150 కోట్లు), ఖైదీ నెం. 150(రూ. 164 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. లైఫ్ టైమ్ రన్‌లో రంగస్థలం ఈ రెండు చిత్రాలను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మగా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 92 కోట్లకుపైగా వచ్చింది. లైఫ్ టైమ్ రన్‌లో రూ. 100 కోట్ల షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరో వైపు రంగస్థలం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 3 మిలియన్ గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డుల కేటగిరీలో మొదటి స్థానంలో ఉంది. రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా ‘రంగస్థలం' చరిత్ర సృష్టించింది.


 

loader