టాలీవూడ్ లో ఈ మధ్య ఓ పాట ఎక్కువగా వినిపిస్తోందని అందరికి తెలిసిన విషయమే. 1980ల్లోని ప్రేమ కావ్యం ఎలా ఉంటుందో రంగస్థలం వారు హార్ట్ కి కనెక్ట్ అయ్యేలా వినిపించారు. ఎంత సక్కగున్నవే అనే పాట లవర్స్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది. అయితే ఆ సింగిల్ పాట మొత్తం రంగస్థలం ఆల్బమ్ పై అంచనాలను పెంచుతోంది. ఎందుకంటే రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఆ ప్రేమ పాటే.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించి పాడిన ఆ పాటలో ఎదో చెప్పలేని మ్యాజిక్ ఉందని అందరు చర్చించుకుంటున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ టెస్ట్ కి తగ్గట్టు చంద్రబోస్ లిరిక్స్ కూడా పాటకు ప్రాణంలా నిలిచాయి. ఇప్పటివరకు కొన్ని మ్యూజిక్ యాప్స్ లలో ఇది బెస్ట్ సాంగ్ అనిపించుకుంది. ఇక యూట్యూబ్ లో 199k లైకులతో కోటి వ్యూవ్స్ ని అందుకొని దూసుకుపోతోంది. ఇంకా కూడా మరిన్ని లైకులను వ్యూవ్స్ ను పొందే అవకాశం ఉంది. ఈ పాటలో సమంత హావభావాలు రామ్ చరణ్ మూమెంట్స్ స్పెషల్ గా నిలవనున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక రంగస్థలం సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయి. రామ్ చరన్ - సమంత ఇతర సినిమాల షూటింగ్ తో బిజీగా ఉంటారు కాబట్టి ముందుగా వారి డబ్బింగ్ పనులకు సుకుమార్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో సినిమాలోని మరో పాటను కూడా రిలీజ్ చేసి రెగ్యులర్ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేయాలని అనుకుంటోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చ్ 30న రిలీజ్ కాబోతోంది.