ఓవర్సీస్ లో కెరీర్ బెస్ట్ రికార్డ్ సెట్ చేసిన చరణ్

First Published 30, Mar 2018, 3:15 PM IST
Ramcharan rangasthalam rocking in overseas
Highlights
ఓవర్సీస్ లో కెరీర్ బెస్ట్ రికార్డ్ సెట్ చేసిన చరణ్

రంగస్థలం.. ఇప్పుడు ఎక్కడ చూసినా సినీ అభిమానుల నోట ఇదే మాట. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 1980ల నాటి కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. నటన పరంగా రామ్‌చరణ్‌ను మరో మెట్టు ఎక్కించింది. అతడి కెరీర్లోనే ది బెస్ట్ అనిపించేలా.. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1700 థియేటర్లలో రిలీజ్ అయిన రంగస్థలంలో అమెరికా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలుకొడుతోంది. 

యూఎస్‌లో గత రాత్రే 142 సెంటర్లలో రంగస్థలం విడుదలైంది. ఈ మూవీ ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 6.2 లక్షల డాలర్లు వసూలు చేసింది. తద్వారా ప్రీమియర్ షో వసూళ్ల పరంగా ఆరో అతిపెద్ద తెలుగు చిత్రంగా రంగస్థలం రికార్డు నెలకొల్పింది.

 ఓవర్సీస్‌ కలెక్షన్ల పరంగా చెర్రీ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా ఈ మూవీ నిలవనుంది.

ప్రీమియర్ షోల ద్వారా 2.45 లక్షల డాలర్లు రాబట్టిన బాహుబలి-2 ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో అజ్ఞాతవాసి, ఖైదీ నంబర్ 150, స్పైడర్ చిత్రాలు ఉన్నాయి. టాప్-6లో మూడు సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోలవే కావడం విశేషం.

loader