మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ మూవీ రిలీజ్‌కు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్‌ను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన చిట్టిబాబు, రామలక్ష్మిల టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపగా.. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 18న వైజాగ్‌లో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా.. మెగా హీరోలతో పాటు అక్కినేని కోడలు సమంత ప్రత్యేక ఆకర్షణ కానుంది.
 

 

 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా సుకుమార్ నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్... చిట్టిబాబు పాత్రలో నటిస్తుండటంతో ఆయన సరసన సమంత రామలక్ష్మి పాత్రలో హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఎంత సక్కగున్నావే లచ్చిమీ..’కి సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎరినేని, రవిశంకర్ ఎరినేని, మోహన్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.