రంగస్థలం ఫస్ట్ రివ్యూ..

ramcharan rangasthalam movie first review
Highlights

మొత్తానికి వాళ్ల ముగ్గురి నటన హైలైట్ గా నిలుస్తోందన్నమాట.

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘రంగస్థలం’. ఈ శుక్రవారం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. పల్లెటూరి వాతావరణంలో, చెర్రీ గత సినిమాలకు భిన్నంగా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ సంగీతం అందించిన మ్యూజిక్ ఆల్బమ్, ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా బాగుందనేది సెన్సార్ టాక్.

కాగా సినిమాలకు ముందుగానే రివ్యూలు ఇచ్చే ఉమర్ సంధూ ‘రంగస్థలం’కు కూడా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ఇది పైసా వసూల్ మసాలా ఫ్లిక్‌గా అభివర్ణించాడు. రామ్ చరణ్, సమంత, జగపతి బాబు అద్భుతంగా నటించారంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఈ మూవీకి 3.5 రేటింగ్ కూడా ఇచ్చేశాడు.


గతంలో సంధూ టాప్ రేటింగ్ ఇచ్చిన కాటమరాయుడు, స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. దీంతో మనోడు ఇచ్చే రివ్యూలపై విశ్వసనీయత సన్నగిల్లింది. కానీ రంగస్థలం సినిమాతో వాటిని ముడిపెట్టి చూడలేం. ఇప్పటి వరకైతే ఈ మూవీకి అన్నీ సానుకూలంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి సంధూ ఇచ్చిన రేటింగ్ నమ్మబుద్ధయ్యేలాగే ఉంది.

ఈయన రేటింగ్ పక్కనబెడితే... సినిమా నిడివి ఎక్కువగా ఉన్న ఏ ఒక్క సీన్‌ను తొలగించొద్దని చిరంజీవి చెప్పారని తెలుస్తోంది. దాదాపు 3 గంటల నిడివి ఉన్నా.. చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. దీన్ని బట్టే రంగస్థలం హిట్ అనే నిర్ణయానికి వచ్చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు గానీ.. సుక్కు డైరెక్షన్ జిగేల్ రాణిని స్టెప్పులు, మహాలక్ష్మీ నడుం ఒంపులు, పల్లెటూరి సోయగాలు.. అన్నింటికీ మించి సౌండ్ ఇంజినీరింగ్‌ చిట్టిబాబు కోసం పక్కాగా సినిమా చూసేయొచ్చు.

 

loader