విడిపోయిన రాజమౌళి టీమ్.. అదే కారణం

First Published 9, Dec 2017, 6:18 PM IST
ramcharan ntr movie devides rajamouli team
Highlights
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తదుపరి మూవీ
  • ఈ మూవీ కోసం తన టీమ్ ను రెండుగా చీల్చిన జక్కన్న
  • ఎన్టీఆర్ కోసం ఒకటీమ్, రామ్ చరణ్ కోసం మరో టీమ్

 

దర్శకదీరుడు జక్కన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తెరకెక్కించనున్న తన నెక్స్ట్ మల్టీస్టారర్ సినిమా కు అన్నీ పర్ ఫెక్ట్ గా వచ్చేలా ప్రత్యేకంగా ఒక టీమ్ ను సెట్ చేసుకుంటున్నాడు. అన్నీ సెట్ చేసుకుని గాని షూటింగ్ ప్రారంభించరు రాజమౌళి. ఈ కోవలోనే తదుపరి చేయబోయే మల్టీస్టారర్ కోసం తన టీమ్ ను రాజమౌళి రెండు భాగాలుగా విడగొట్టాడట.

 

రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో ఒక భారీ మల్టి స్టారర్ సినిమాలను తెరకెక్కించబోతోన్న నేపథ్యంలో ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి కథా చర్చలు కొనసాగిస్తున్న రాజమౌళి పనిలో పనిగా రెండు టీమ్స్ ను ముందే రెడీ చేసుకున్నాడు. ఒక టీమ్ మొత్తం రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ ని మరొక టీమ్ ఎన్టీఆర్ సీన్స్ ని టెస్ట్ షూట్ చేయనుందట. ఆ తర్వాత రెండు టీమ్ చేసిన సీన్స్ ను పరిశీలించి తాను ఒక క్లారిటీకి రానున్నాడట జక్కన్న.

 

ఉహలకందని సీన్స్ ఇందులో ఉన్నాయట.. సో ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు అలాగే ఇద్దరు హీరోలు ఇమేజ్ కి తగ్గట్టుగా బ్యాలెన్స్ గా ఉందా లేదా అని తెలుసుకునేందుకు రాజమౌళి ఆ విధంగా ప్లాన్ చేశాడట. మల్టి స్టారర్ సినిమా చేయాలంటే పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఏ ఒక్క హీరోని తక్కువగా చూపించిన అభిమానులు హర్ట్ అవుతారనే టెన్షన్ చాలా ఉంటుంది. మరి రాజమౌళి ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి. 

loader