శరవేగంగా పూర్తవుతున్న మెగాపవర్ స్టార్ మూవీటాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ధృవ సినిమాడిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతున్న రామ్ చరణ్ ధృవగీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ధృవ
ప్రస్థుతానికి ధృవ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. నవంబర్ మొదటివారంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పూర్తవుతుంది. అనంతరం కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే.. మెగా అభిమానులు, ప్రేక్షకుల అటెన్షన్ తనవైపు తిప్పుకున్న రామ్‌చరణ్... ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
సినిమా ఆడియో వివరాలు కూడా త్వరలో వెల్లడికానున్నాయి. ఈ సినిమాను మరో రెండు నెలల్లో పూర్తి చేసి సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దసరా సందర్భంగా సందర్భంగా ధృవ టీజర్‌ను విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది.
`నీ స్నేహితుడెవరో తెలిస్తే..నీ క్యారెక్టర్ తెలుస్తుంది...నీ శత్రువు ఎవరో తెలిసే..నీ కెపాసిటీ తెలుస్తుంది` అంటూ మెగావపర్ స్టార్ చరణ్ చెప్పిన డైలాగ్ తో కూడిన యాభై సెకన్ల ఈ టీజర్ గురించే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ.
ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కు, ఓ సైంటిస్ట్‌కు మధ్య సాగే మైండ్‌గేమ్ నేపథ్యంలో ఆద్యంతం రసవత్తరంగా సాగే చిత్రమిది. ఆ మైండ్ గేమ్ ఏమిటి? అనేది తెలియాలంటే మా ధృవ చూడాల్సిందే అంటున్నారు సురేందర్‌రెడ్డి. తమిళ హిట్ చిత్రం తని ఒరువన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని సురెందర్ రెడ్డి తెలిపారు.
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్- పి.యస్.వినోద్, మ్యూజిక్ - హిప్ హాప్ తమిళా (ఆది), ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా- వి.వై. ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
