పేరంటల పల్లి'.... పాపికొండల విహారయాత్రకు వెళ్లిన వారికి ఈ ఊరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి సమీపంలో జరుగుతోంది. షూటింగ్ గ్యాపులో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి పాపికొండలు విహారానికి వెళ్లారు. ఇందులో భాగంగా పాపికొండల మధ్య ఉండే గిరిజనగూడెం పేరంటాలపల్లిని సందర్శించారు.

పేరంటాలపల్లికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసించే గ్రామస్తుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.

 పేరంటాలపల్లి గ్రామస్తుల నుండి నేర్చుకోవాల్సి చాలా ఉంది. వారికి పరిమితమైన సౌకర్యాలే ఉన్నప్పటికీ ఉన్నదాంట్లో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. తమ గ్రామాన్ని ఎంతో ప్రేమిస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ తో జీవిస్తున్నారు. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అని ఉపాసన అభిప్రాయ పడ్డారు.

 ఈ సందర్భంగా ఉపాసన, రామ్ చరణ్ పేరంటాలపల్లి గ్రామస్తులతో కలిసి ఫోటో దిగారు. అక్కిడి వారితో ఊరి గురించి, ఊరి బాగోగుల గురించి చర్చించారు.