ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అచ్చం దివ్యభారతిలా ఉందంటూ ఏకంగా తొలిముద్దు సినిమాలో కొంత పార్ట్ డమ్మీగా షూటింగ్ కూడా చేయించారు. హిట్లర్ - బావగారు బాగున్నారా సినిమాల్లో చిరంజీవితో ధీటుగా స్టెప్స్ వేసిన హీరొయిన్ రంభ పరిశ్రమకు దూరమైనా తనను ఎవరు మర్చిపోలేదు. డాన్సింగ్ గ్రేస్ తో పాటు మంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్న రంభ తెలుగులో అగ్ర హీరోలందరి సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది.. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న రంభ వ్యాపారవేత్త అయిన తన భర్తతో విడాకులు కోరుతూ కోర్ట్ కు వెళ్లిందని కోలీవుడ్ టాక్.

ఇదలా ఉంచితే త్వరలో రంభ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుందని కొత్త టాక్. కాని ఆ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. కమెడియన్ సప్తగిరి హీరోగా రూపొందే కొత్త సినిమాలో ఒక కీలక పాత్రకు రంభ ఓకే చెప్పినట్టు తెలిసింది. అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రం శ్రీకాకుళం తీసిన దర్శకుడు ఈశ్వర్ దీన్ని తీయబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు రచన చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో రంభ పాత్ర ఏమై ఉంటుందా అనే అంచనాలో ఉన్నారు అభిమానులు. త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్న ఈ మూవీకి టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు.

రీ ఎంట్రీతో రమ్య కృష్ణ నదియా ఇంద్రజ ఆమని భానుప్రియ ఇలా అందరు మంచి ఫాంలో ఉంటూ అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నారు. ఈ లిస్టు లో రంభ కూడా చేరడానికి ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది అధికారికంగా వెలువడాల్సి ఉంది. సప్తగిరి సరసన హీరొయిన్ గా ఎవరు చేస్తారనేది ఇంకా డిసైడ్ కాలేదని వార్త.