మొన్న 'వైరస్'.. ఈరోజు 'భైరవగీత'!

First Published 18, Jun 2018, 2:43 PM IST
Ram Gopal Varma announces film with dolly dhanunjaya
Highlights

నాగార్జున లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కూడా సరైన సినిమా చేయలేకపోయాడు వర్మ.

నాగార్జున లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కూడా సరైన సినిమా చేయలేకపోయాడు వర్మ. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు చేసిన వర్మ ఇప్పుడు ఒక హిట్టు సినిమా కోసం పరితపిస్తున్నాడు. కానీ 'ఆఫీసర్' సినిమా దర్శకుడిగా అతడి రేంజ్ ఏంటో ప్రూవ్ చేసింది. కనీసపు వసూళ్లను కూడా సాధించలేకపోయింది. గతంలో కూడా ఆయన ఫ్లాప్ సినిమాలు చేశాడు కానీ ఏదోరకంగా ఆ సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చేలా చూసుకున్నాడు.

ఆఫీసర్ సినిమాకు మాత్రం తన ప్లాన్ ఏవీ వర్కవుట్ కాలేదు. ఇక వర్మ సినిమాలు చేయడం మానేస్తే మంచిదనే విమర్శలు వినిపిస్తోన్న నేపధ్యంలో 'వైరస్' అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆ సినిమా సంగతి ఏమవుతుందో తెలియదు కానీ తాజాగా ఆయన మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే 'భైరవగీత'. కన్నడ నటుడు 'డాలి' ధనుంజయ నటనను మెచ్చిన వర్మ తనతో సినిమా చేస్తానని గతంలో మాటిచ్చాడట.

ఇప్పుడు దాన్ని నిలబెట్టుకునే పనిలో పడ్డాడు. అయితే ఈ సినిమాను వర్మ డైరెక్ట్ చేయడం లేదు. నిర్మాతగా పని చేయనున్నారు. సిద్ధార్థ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. యాక్షన్, థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 


 

loader