డబ్బు తీసుకొని ఇప్పుడే తప్పుకో అని తేజ అన్నాడు : శ్రీరెడ్డి

Ram gopal varma and teja tried for settlement
Highlights

డబ్బు తీసుకొని ఇప్పుడే తప్పుకో అని తేజ అన్నాడు

కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి.. తనకు కొంత మద్దతు లభిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ను బూతు తిట్టి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. అప్పట్నుంచి ఆమె మాటలకు విలువ లేకుండా పోయింది. ఆ తర్వాత టీవీ ఛానెళ్లలో కూడా శ్రీరెడ్డికి వాయిస్ లేకుండా పోయింది. కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కడా కనిపించని శ్రీరెడ్డి.. కొంత విరామం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆమె దర్శకుడు తేజ మీద సంచలన ఆరోపణలు చేసింది. సురేష్ బాబు కుటుంబం తరఫున తేజ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ అభిరామ్ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆమె ఆరోపించింది.

తాను ఫిలిం ఛాంబర్ ముందు నిరసన చేయడానికి ముందే సురేష్ బాబు కుటుంబం రాజీ ప్రయత్నాలు చేసిందని ఆమె వెల్లడించింది. దర్శకుడు తేజ ద్వారా తనకు రెండు సినిమాలు బిస్కెట్ల మాదిరి పడేశారని శ్రీరెడ్డి అంది. ‘‘వాళ్లు పెద్ద వాళ్లు..  కోర్టుకు వెళ్లినా ఇదే జరుగుతుంది. ఇంత హడావిడి ఎందుకు? డబ్బు తీసుకుని ఇప్పుడే తప్పుకో’’ అని తేజ తనకు సూచించాడని.. తాను చూద్దాంలే అన్నానని శ్రీరెడ్డి తెలిపింది. తేజతో పాటు వర్మ కూడా తనతో ఇలాగే సెటిల్మెంట్ కోసం ప్రయత్నించాడని ఆమె అంది. రెండే సినిమాల్లో నటించిన తనకు ఇన్ని ఆస్తులుండటంపై వస్తున్న ప్రశ్నలకు శ్రీరెడ్డి సమాధానం చెప్పింది. విజయవాడలో భూముల ధరల పెరిగాక అక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ లో స్థిరపడినట్లు తెలిపింది. తాను చేస్తున్న ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకే తమన్నా అనే ట్రాన్స్ జెండర్ తన వద్దకు వచ్చిందని.. ఆమెను ఎవరు పంపారో తనకు తెలుసని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

loader