మెగాహీరో మొబైల్ షాప్!

Ram Charan Turns Brand Ambassador
Highlights

బాలీవుడ్ హీరోలు బ్రాండ్ ఎండార్సింగ్ లో చూపించేంత శ్రద్ధ మన టాలీవుడ్ 

బాలీవుడ్ హీరోలు బ్రాండ్ ఎండార్సింగ్ లో చూపించేంత శ్రద్ధ మన టాలీవుడ్ హీరోలు చూపరనేచెప్పాలి. ఈ విషయంలో మహీష్ బాబుని మాత్రం మెచ్చుకోవాలి. తన దగ్గరకి వచ్చే బ్రాండ్స్ అన్నింటినీ రిప్రజంట్ చేస్తూ తన స్టార్ డమ్ మరింత పెంచుకుంటున్నాడు.

అల్లు అర్జున్ కూడా రెడ్ బస్, లాట్ మొబైల్స్ వంటి వాటికీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో మెగాహీరో బ్రాండింగ్ లోకి దిగినట్లు తెలుస్తోంది. నటుడిగా గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ గతంలో డోకోమో వంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా చేశారు. ఆ తరువాత బ్రాండ్ ఎండార్సింగ్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపక వదిలేశాడు. అయితే ఇప్పుడు మొబైల్స్ అమ్మే కంపనీకు బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడని సమాచారం.

హ్యాపీ మొబైల్స్ అనే సంస్థ తమ ప్రచారకర్తగా మెగాహీరో వ్యవహరించబోతున్నాడంటూ వెల్లడించింది. ''R you ready to C''అంటూ ఒక యాడ్ ఇవ్వడం.. అందులో ఆర్  మరియు సి అక్షరాలను హైలైట్ చేయడంతో బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ అనే విషయం అర్ధమవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.  

loader