మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కన్న రాజమౌళి బాహుబలి తర్వాత రూపొందిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇప్పటికే రాంచరణ్ అల్లూరి లుక్ కోసం మీసాలు, ప్రత్యేకమైన హెయిర్ స్టైల్, ఫిజిక్ మైంటైన్ చేస్తున్నాడు. 

రాంచరణ్ రీసెంట్ గా జిమ్ లో కసరత్తులు చేస్తుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జిమ్ లో ఓ చిన్న పిల్లాడు కనిపించగా రాంచరణ్ అతడితో సరదాగా మాట్లాడాడు. ఇద్దరూ ఫన్నీగా వాదులాడుకున్నారు. 

RRR: ఎన్టీఆర్ హీరోయిన్ పిచ్చ హ్యాపీ.. ఇండియా అద్భుతం అంటున్న లేడి విలన్!

జిమ్ లో ధృవ చిత్ర సాంగ్ ప్లే అవుతోంది. ఈ సాంగ్ ఏ మూవీలోది అని రాంచరణ్ ఆ బుడ్డోడిని అడిగాడు. అది ధృవ సినిమా.. అందులో నేను నిన్ను చూశా అని చెప్పాడు. నన్ను చూశావా.. అది నేను కాదు మీ నాన్న అని రాంచరణ్ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. కాదు నువ్వే అని పిల్లాడు వాదించాడు. 

ఈ క్యూట్ వీడియోను చరణ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. 3 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Gym buddies !

A post shared by Ram Charan (@alwaysramcharan) on Nov 20, 2019 at 4:20am PST

ఇక సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అల్లూరి, కొమరం భీం రెండేళ్ల పాటు యుక్తవయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ రెండు సంవత్సరాలు ఏం జరిగి ఉంటుందనే ఆసక్తికర అంశాన్ని రాజమౌళి కల్పిత గాధగా తెరక్కించబోతున్నారు. 

కాజల్, అనుష్క కోసం ట్రై చేశారు.. తెలుగు అమ్మాయిల విషయంలో అది నిజమే!

డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ భామ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రే స్టీవెన్సన్, అలిసన్ డూడి విలన్లుగా నటిస్తున్నారు.