RRR: ఎన్టీఆర్ హీరోయిన్ పిచ్చ హ్యాపీ.. ఇండియా అద్భుతం అంటున్న లేడి విలన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. జక్కన్న రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఇండియా వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పై ఆసక్తి నెలకొంది ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. జక్కన్న రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఇండియా వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పై ఆసక్తి నెలకొంది ఉంది. అంతే కాకుండా సౌత్ లో ఇద్దరు బిగ్ స్టార్ కలసి నటిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి.
సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేలా చిత్ర యూనిట్ బుధవారం రోజు కొందరు ప్రధాన నటీనటుల్ని ప్రకటించింది. సినిమా ప్రారంభమై ఏడాది గడచినా ఎన్టీఆర్ కు హీరోయిన్ సెట్ కాలేదు. మొదట డైసీ ఎడ్గార్ జోన్స్ అనే విదేశీ భామని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి తప్పుకుంది.
RRR: జక్కన్న మరో బిగ్ ప్లాన్.. టార్గెట్ 10
పలువురు విదేశీ భామలని పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు రాజమౌళి ఒలివియా మోరిస్ అనే ఇంగ్లీష్ బ్యూటీని ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈమె బ్యాగ్రౌండ్ ఏంటి అని అంతా సెర్చ్ చేస్తున్నారు. ఒలివియా ఇంగ్లాండ్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్. ఆమె ఇంతవరకు ఎలాంటి చిత్రంలో నటించలేదు. ఆర్ఆర్ఆర్ మూవీనే ఒలివియాకు తొలి చిత్రం.
ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆమెని ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ప్రకటించిన తర్వాత ఒలివియా సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేసింది. 'నాకు అద్భుతమైన స్వాగతం పలికిన అందరికి ధన్యవాదాలు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను అని ఒలివియా ట్వీట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఒలివియా 'జెన్నిఫర్' అనే బ్రిటిష్ యువతిగా నటించనుంది.
ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఐర్లాండ్ కు చెందిన రే స్టీవెన్సన్ విలన్ గా నటించనున్నాడు. స్టీవెన్స్ పాత్ర పేరు 'స్కాట్'. లేడీ విలన్ పాత్రలో ఐర్లాండ్ కు చెందిన హాలీవుడ్ నటి అలిసన్ డూడీ నటించనుంది. ఆమె పాత్ర పేరు 'లేడీ స్కాట్'. ఈ 53 ఏళ్ల బ్రిటిష్ నటి కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేసింది. అమేజింగ్ టీంతో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియా అద్భుతం అని సోషల్ మీడియాలో అలిసన్ పేర్కొంది.
మొత్తంగా రాజమౌళి అంతర్జాతీయ నటీనటుల్ని తన చిత్రంలో నటింపజేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. 1920 కాలంలో బ్రిటిష్ పాలన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా ఈ మూవీలో నటిస్తున్నారు. దడివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తుండడం విశేషం. రాంచరణ్ కు హీరోయిన్ గా అలియా భట్ నటిస్తోంది. సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు.