Asianet News TeluguAsianet News Telugu

Ram Charan : మైసూర్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్న రామ్ చరణ్, కారణమేంటంటే..?

ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం మైసూర్ లో ఉన్నాడు మెగా  పవర్ స్టార్ రామ్ చరణ్. గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ హీరో.. సడెన్ గా హైదరాబాద్ బయలు దేరారు. కారణం ఏంటంటే..? 
 

Ram Charan Coming To Hyderabad From Game Changer Shooting For Vote JMS
Author
First Published Nov 29, 2023, 6:34 PM IST

ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.  తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ అందుకుంది. మొన్నటి వరకూ బ్రేక్ లు వేసుకుంటూ సాగిన షూటింగ్ .. పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఈ మూవీ షెడ్యూల్ మైసూర్ లో జరుగుతుంది.  దిల్ రాజు నిర్మిస్తున్నఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక అసలు విషయం ఏంటంటే.. షూటింగ్ జోరుగా సాగుతున్న సమయంలో మెగా పవర్ స్టార్ సడెన్ గా హైదరాబాద్ కు బయలు దేరారు. ఆయన షూటింగ్ జరుగుతున్న మైసూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సామాన్యులు, సెలబ్రిటీలు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం మైసూర్‌లో జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. 

అసలే బ్రేక్ లతో నగిచింది గేమ్ చేంజర్ షూటింగ్. ఇప్పటికి కంప్లీట్ అవ్వాల్సింది. చాలా కారణాల వల్ల చాలా డిలే అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు రీసెంట్ గా మైసూర్ లో ఫ్రెష్ గా షెడ్యుల్ ను స్టార్ట్ చేసుకున్నారు. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా ఓ స్టార్ హీరో ఇలా  షూటింగ్  నుండి ఓటు వేయడానికి అంత ఖర్చు పెట్టుకుని రావడం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఓటు హక్కు ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  రేంజ్ మారిపోయింది. గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా హీరో. ఆస్కార్ విన్ అవ్వడంతో ఆయన రేంజ్ మారిపోయింది. అటు బాలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్లు రామ్ చరణ్ కోసం వెచి చూస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ ను పూర్తి చేసిన తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు చరణ్. 


 

Follow Us:
Download App:
  • android
  • ios