RRR: ట్రిపుల్ ఆర్ హీరోలకు రాజమౌళి టార్చర్.... తట్టుకోలేకపోయామన్న హీరోలు....
డైరెక్టర్ రాజమౌళి తన పర్ఫెక్షన్ తో తమకు టార్చర్ చూపించాడన్నారు ట్రిపుల్ ఆర్ హీరోలు. హీరోల నుంచి అవుట్ పుట్ రాబట్టుకోవడంలో రాజమౌళి ఎక్కడా తగ్గడన్నారు.
ట్రిపుల్ ఆర్ విషయంలో ఎక్కడా తగ్గలేదు డైరెక్టర్ రాజమౌళి. అలా అనుకుంటే ఇప్పటి వనకు తన చేసిన ఏ సినిమా విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు స్టార్ డైరెక్టర్. ట్రిపుల్ ఆర్ విషయంలో అంతకు మించిన వర్క్ తను చేస్తూనే.. తన టీమ్ తో కూడా చేయించాడు జక్కన్న. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్ – చరణ్. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా జక్కన్న పనితనం గురించి తమను పెట్టిన టార్చర్ గురించి సరదాగా చెప్పారు.
తనకు కావల్సిన అపుట్ పుట్ తెచ్చుకోవడం కోసం.. తను ఎంత టైమ్ అయీనా పెడతాడు.. అవతలివాళ్ళను ఎంత టార్చర్ అయినా పెడతాడన్నారు. ముఖ్యంగా కరోనా వల్ల ట్రిపుల్ ఆర్ షూట్ డిలే అవుతూ వచ్చింది. ఈ రెండు మూడేళ్లలో ఎప్పుడు సెట్స్ కు వచ్చినా.. హీరోలలో ఏమైన మార్పులు జరిగాయా అనేది గమనించేవాడన్నారు. జుట్టు పెరిగిందా... గడ్డం కరెక్ట్ గా ఉందా.. బుగ్గలు పెరిగాయా తగ్గాయా.. బాడీ ఫిట్ గా ఉందా లేదా.. ఇలా అన్ని విషయాలు పర్టిక్యూలర్ గా చూసేవాడని.. ఏమైనా తేడా వస్తే అంతే సంగతులంటూ.. సరదాగా చెప్పుకున్నారు. జక్కన్నకు వర్క్ విషయంలో ఉన్న కమిట్ మెంట్ అది అంటూ కితాబిచ్చారు.
తారక్ మాట్లాడుతూ.. తాను టైగర్ తో ఫేస్ టూ ఫేస్ గర్జించినా.. ఆ అసలైన టైగర్ మాత్రం రాజమౌళినే అన్నారు.వెనకున్న ఈ టైగర్ కు మేము భయపడాలి.. అప్పుడు ముందున్న టైగర్ పెద్ద భయం అనిపించదన్నారు. ఫిట్ నెస్ విషయంలో కూడా తాను అనుకున్న హీరో ఎలా ఉండాలో... ఆ రూపం వచ్చే వరకూ దగ్గరుండి ట్రైనింగ్ ను పరిశీలించాడన్నారు. ఇక జక్కన్న కూడా తమతో కలిసి వర్కౌట్స్ చేస్తూ.. స్పూర్తినిచ్చారంటూ రాజమౌళి పనితన్నాన్న ప్రశంసించారు ట్రిపుల్ ఆర్ స్టార్స్.
గతంలో కూడా రాజమౌళి గురించి తారక్ పలు సందర్భాలలో ఇలా సరాదా కామెంట్స్ చేశారు. పని విషయంలో రాజమౌళి విజన్ గురించి చాలా సార్లు వివరించారు. రీసెంట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కూడా తారక్ జక్కన్న పనితనం గురించి సూపర స్టార్ మహేష్ తో పంచుకున్నారు. త్వరలో సినిమా చేయబోతున్నారు.. రాజమౌళి పనితనం గురించి చూస్తారు... అంటూ పంచ్ ఇచ్చారు. జక్కన్న హీరోల దగ్గర నుంచి తనకు కావల్సిన అపుట్ పుట్ ను పక్కాగా రాబట్టుకుంటారన్నారు.