ఇండస్ట్రీలో.. అది మంచి పద్ధతి కాదు!

First Published 24, May 2018, 7:39 PM IST
ram charan about box office collection posters
Highlights

పోస్టర్స్ మీద ఫిగర్స్ వేయడం నాకు అంత ఆరోగ్యకరంగా అనిపించదు

గత కొన్నేళ్లుగాసినిమా ఇండస్ట్రీలో ఓ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అదేంటంటే సినిమా హిట్ అయిందంటే.. వారం రోజుల్లోనే వంద కోట్లు, రెండు వందల కోట్లు అంటూ పోస్టర్లు వేస్తున్నారు. ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో లేదో అన్న సంగతి పక్కన పెడితే ఈ పోస్టర్లు మాత్రం కంపల్సరీ అయిపోతున్నాయి. మా సినిమా ఇంత వసూలు చేసిందని ఒక నిర్మాత పోస్టర్ వదిలితే.. దానికి పోటీగా విడుదలైన మరో సినిమా అంతకు మించి వసూలు చేశామంటూ పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన రామ్ చరణ్.. ''ప్రేక్షకులు పోస్టర్స్ పై చూపిస్తోన్న బాక్సాఫీస్ ఫిగర్స్ పై స్పందిస్తోన్న తీరు నాకు అంత ఆరోగ్యకరంగా అనిపించదు. ఈ పద్ధతి నాకు అసలు నచ్చదు. అందుకే ఇప్పటినుంది నేను సినిమాలు చేసే నిర్మాతలతో ఇలాంటి పోస్టర్స్ వేయకూడదని ముందే చెప్పదలుచుకున్నాను. సినిమా సక్సెస్ అనేది బాక్సాఫీస్ ఫిగర్స్ లో ఉండను. మన సినిమాను ఎంతమంది చూస్తున్నారు.. ఎంతగా ఆదరిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని'' చరణ్ అన్నారు. 

loader