బాలీవుడ్ ప్రయత్నాలు మానను.. ప్రియాంకతో కలిసి నటించాలనుంది!

ram charam about priyanka chopra
Highlights

టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న తారలు బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకోవాలని 

టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న తారలు బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో నేటి తరం హీరోయిన్లు చాలా మంది బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేశారు. నటుడు రామ్ చరణ్ కూడా బాలీవుడ్ లో 'జంజీర్' అనే సినిమాలో నటించాడు.

ఇదే సినిమా తెలుగులో తుఫాన్ అనే పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమా అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నానని కానీ ఫలితం తనను చాలా నిరాశ పరిచిందని రామ్ చరణ్ అన్నారు. అలానే మరోసారి బాలీవుడ్ లో ఛాన్స్ వస్తే ప్రియాంకచోప్రాతో కలిసి నటిస్తానని అన్నారు. ''బాలీవుడ్ లో జంజీర్ మొదటి సినిమా కావడంతో చాలా కష్టపడ్డాను కానీ రిజల్ట్ మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. అలా అని బాలీవుడ్ ప్రయత్నాలు మాత్రం మానను. మంచి కథ దొరికితే మరోసారి బాలీవుడ్ లో సినిమా చేయడానికి రెడీ.. అలానే ప్రియాంక చోప్రాతో కూడా చేయాలనివుంది.

ఆమె టాలెంటెడ్ యాక్ట్రెస్'' అని వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది దసరా కానుకగా ఆ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తారక్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నాడు.  

loader