త్వరలో కార్తీ సరసన నటించనున్న రకుల్ డ్రీమ్ వారియర్స్ బేనర్ పై కార్తీ హీరోగా మూవీ 

వరుస హిట్లతో లక్కీగాళ్ గా పేరుతెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ ముద్దుగుమ్మ త్వరలోనే తమిళ హీరో కార్తీ సరసన నటించేందుకు రంగం సిద్ధంమవుతోంది.

కాష్మోరా స‌క్సెస్ త‌ర్వాత హీరో కార్తీ మ‌ణిర‌త్నం సినిమా కాట్రు వెలియ‌డు సినిమాలో న‌టించాడు. ప్ర‌స్తుతం సినిమా రీ రికార్డింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమా త‌ర్వాత కాష్మోరా చిత్రాన్ని నిర్మించిన డ్రీమ్ వారియ‌ర్ బ్యాన‌ర్‌పై కార్తీ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌బోతున్నాడు. వినోద్ అనే దర్శ‌కుడు తెరకెక్కించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సినిమాలో కార్తీ స‌ర‌స‌న హీరోయిన్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరుని ప‌రిశీలిస్తున్నార‌ట‌. మ‌రి తెలుగులోనే చేతి నిండా ఆఫర్స్‌తో బిజీగా ఉన్న ర‌కుల్, మ‌రి కార్తీ ప‌క్క‌న న‌టిస్తుందా లేదా అనేది ప్రస్థుతానికి సస్పెన్స్.