ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం దిగిన హాట్ పిక్స్ సంచలనంగా నిలిచాయి. ఆ ఫొటో షూట్లో ఒక రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేసింది రకుల్. సినిమాలకు మించిన స్థాయిలో అందాలను ఆరబోసిందామె. బహుశా రకుల్ సినిమాల్లో కూడా ఆ స్థాయిలో ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ చేసినట్టుగా లేదు. ఈ నేపథ్యంలో రకుల్ ఫొటో షూట్ చర్చనీయాంశంగా నిలిచింది. ఆమెపై కొంతమంది విమర్శనాస్త్రాలను కూడా సంధించారు.

దీంతో రకుల్ రియాక్ట్ కాక తప్పలేదు. ఆ ఫొటో షూట్ విషయంలో తనపై విమర్శలు చేసిన వారి పట్ల ఘాటుగా స్పందించింది రకుల్ ప్రీత్. ‘ఎలా కనిపించాలి అనేది నా ఇష్టం. అలా కనిపించడంలో నాకు లేని అభ్యంతరం వారికి ఎందుకు?’ అని అంటోంది ఈ హీరోయిన్. ఈ విధంగా నా స్టిల్స్ నా ఇష్టం.. అన్నట్టుగా రియాక్ట్ అయ్యింది.

అలాగే కొంతమంది చేసిన కామెంట్లతో తను కుంగిపోయేది ఏమీ ఉండదని కూడా రకుల్ స్పష్టం చేసింది. తన ఫొటో షూట్ పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లను తను అస్సలు లెక్క చేయను అని.. వాళ్లు తన కాన్ఫిడెన్స్ ను దెబ్బతీయలేరు అని తేల్చి చెప్పింది.

ప్రముఖ మ్యాగ్జైన్ల కవర్ పేజీ మెరవాలి అనేది ఎవరికైనా ఉండే కలే అని, తనకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి తను వాడుకున్నాను అని రకుల్ వివరించింది. ఇక తెలుగులో చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంపై కూడా రకుల్ స్పందించింది. మంచి సబ్జెక్టులు రాలేదు కాబట్టే.. తన చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు అని తెలివిగా సమాధానం ఇచ్చింది ఈ పంజాబీ భామ.